సమస్యల నిలయంగా అనంత ఆస్పత్రి

* వైద్యుల కొరతతో రోగుల ఆందోళన
* ఉన్న డాక్టర్లపై పెరుగుతున్న ఒత్తిడి
డాక్టర్లకొరతతో వైద్య సేవలు అందక అనంత సర్వజనాసుపత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే సకాలంలో వైద్యం అందకపోవడానికి దాక్టర్ల కొరతేకారణమన్న విషయాన్ని గుర్తించని రోగులుఉన్న డాక్టర్లపై విసుగు చెందుతున్నారు. అయితే పదిమంది పనిచేయాల్సిన చోట ముగ్గురే ఉన్నారని వైద్యులు అంటున్నారు.
అనంతపురంలో ఉన్న సర్వజనాసుపత్రి సమస్యల నిలయంగా మారింది. ఇక్కడికి వచ్చే రోగులే గాకుండా పనిచేస్తున్న వైద్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 350 పడకల ఆస్పత్రిని 500 పడకలకు పెంచినా అందుకు అనుగుణంగా డాక్టర్ల సంఖ్యను పెంచకపోవడంతో వచ్చే రోగులకు సకాలంలో సరైన వైద్యం అందడం లేదు.
ఓ వైపు ఆస్పత్రి మరోవైపు వైద్య కళాశాల ఉన్నా అందుకు అనుగుణంగా డాక్టర్లు లేక పని ఒత్తిడితో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. జిల్లా మంత్రి శైలజానాధ్ దృష్టికి సమస్యను తీసుకు వెళ్లినా లాభం లేకుండా పోయిందన్నారు. అరకొర వసతులు, డాక్టర్ల కొరత కారణంగా మెరుగైన వైద్య సేవలు అందడం లేదన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆస్పత్రిపై శ్రద్ధపెట్టి తగినంతమంది వైద్య సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.
Published Date : Wednesday, 1/2/2012 1:27 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |