అద్దె చెల్లించలేదని పాఠశాలకు తాళం వేసిన ఘనుడు

విద్యాబుద్దులు నేర్పే సరస్వతి నిలయానికి తాళం వేశారు. పిల్లల చదువులు ,అల్లరితో మార్మోగిన స్కూల్ ప్రాగంణం మూగబోయింది. అద్దె చెల్లించలేదని ఏకంగా సర్కారు బడికే మూతవేశాడు ఓ యజమాని. దీంతో విద్యార్ధులు, తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. ఆదిలాబాదాద్ జిల్లా మంచిర్యాల పట్టణంలో రాళ్లపేట ప్రైమరీ పాఠశాలలకు తాళం వేశాడు ఇంటి యజమాని. అద్దె భవనంలో కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలకు అద్దె చెల్లించలేదని ఆగ్రహించిన యజమాని ఏ మాత్రం కనికరం లేకుండా మూసేశాడు.
దాదాపు వందమంది విద్యార్ధులు చదువుకుంటున్న ఈ బడిలోఐదేళ్ల ఒప్పందంతో స్కూల్‌ను నడిపిస్తున్నారు. అయితే ఏడాది కాలంగా కిరాయి చెల్లించకపోవడంతో ఆగ్రహించిన యజమాని పాఠశాల ప్రదానోపాధ్యాయుని గదితో పాటు అన్ని గదులకు తాళం వేశాడు. దీంతో ఉపాధ్యాయులు, పిల్లలు ఆరుబయటే ఉండిపోయారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తాళం వేయడం వల్ల విద్యాబోధన చేయలేకపోతున్నామని ఉపాధ్యాయులు తెలిపారు.
ప్రభుత్వం పక్కా భవనాలు నిర్మించకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆరోపించారు. కనీసం అద్దె భవనాలకు కిరాయి చెల్లించకుండా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా విద్యాశాఖాధికారులు స్పందించి పక్కా భవనాలు నిర్మించాలని వేడుకుంటున్నారు.
Published Date : Wednesday, 1/2/2012 3:09 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |