ఉధృతం అవుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె
.jpg)
* ఇబ్బందులు పడుతున్న రోగులు
* సర్కారు దిగివచ్చేవరకు సమ్మె ఆగదంటున్న జూడాలు
* సమ్మె పరిష్కరించాలని ఆందోళనకు దిగిన రోగుల బంధువులు
జూనియర్ డాక్టర్ల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. ఇంతవరకు సాధారణ దీక్ష చేసిన జూడాలు ప్రభుత్వం దిగిరాకపోవటంతో ఆమరణదీక్షకు దిగారు. మరోవైపు, ఈ సమ్మె వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్టయిఫండ్ రెగ్యులరైజ్ చేయటంతోపాటు ఆస్పత్రిలో వైద్య పరికరాల కొరత తీర్చాలంటూ విశాఖ కెజిహెచ్ జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె ముప్పయ్ ఏడవ రోజుకు చేరింది.
ఏళ్లతరబడి స్టయిఫండ్ పెంచుతామంటూ ప్రభుత్వం హామీ ఇస్తున్నా ఇంతవరకూ హామీలు నెరవేర్చలేదని జూడాలు మండిపడుతున్నారు. సమ్మెకు ప్రభుత్వం దిగిరాకపోవటంతో వైద్య సేవలు నిలిపివేసి ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ప్రభుత్వం దిగి వచ్చేవరకు దీక్ష విరమించేది లేదని జూనియర్ డాక్టర్లు తేల్చిచెబుతున్నారు. మరోవైపు, జూనియర్ డాక్టర్ల సమ్మెతో ఆస్పత్రిలో రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
పట్టంచుకునే నాథుడే కరువయ్యాడంటూ రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు లేకపోవటంతో రోగులు ఆస్పత్రి ఖాళీచేసి వెళుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించి రోగుల ప్రాణాలు కాపాడాలని పేషెంట్ల బాధితులు కెజిహెచ్‌లో ఆందోళనకు దిగారు. ఓ వైపు జూడాల సమ్మె కొనసాగుతుండగా మరోవైపు సీనియర్ డాక్టర్లు కూడా సమ్మెకు దిగారు.
సీనియారిటీ ఆధారంగా జీతాలు చెల్లించాలని వారు డిమాండ్‌చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే వైద్యుల సమస్యలు పరిష్కరించి రోగులను కాపాడాలని పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
Published Date : Wednesday, 1/2/2012 4:27 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |