నెల్లూరు జిల్లాలో రౌడీ కోడి
* సెక్యూరిటీ గార్డ్‌లా వ్యవహరిస్తున్న కోడి
* కాపలా కోడి అపరిచితుల పాలిట సింహస్వప్నం
* కోడి చేష్టలకు హడలెత్తుతున్న గ్రామస్థులు
* అల్లారు ముద్దుగా చూసుకుంటున్న కోడి యజమానులు
ఇంటికి కాపలా కోసం అందరూ కుక్కను పెంచుకుంటారు. ఇది అందరూ చేసే పనే. అయితే ఆ ఇంటికి మాత్రం కోడి సెక్యూరిటీ గార్డుగా వ్యవహరిస్తోంది. అపరిచితులు ఇంట్లోకి ప్రవేశిస్తే రక్తం వచ్చేలా పొడిచి తరుముతున్న రౌడీ కాపలా కోడిపై ప్రత్యేక కథనం.
సాధారణంగా ఎవరైన ఇంటి కాపలా కోసం కుక్కను పెంచుకుంటారు. కొంచెం ఆర్థికంగా బాగున్నవారు సెక్యూరిటీగార్డును నియమించుకుంటారు. కానీ వీరికి మాత్రం కోడి ఇంటి కాపలా కాస్తూ ఇంటి దరిదాపులకు వచ్చే వారికి చుక్కలు చూపిస్తోంది.
నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం బూదూరు గ్రామానికి చెందిన జగన్నాధం, బుజ్జమ్మలు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కోడి ఇంటికి కాపలా కాస్తోంది. పౌరుషం ఎక్కువైన కోడి యజమాని లేకుండా ఇంట్లోకి ఎవరైనా ప్రవేశిస్తే కుళ్ల పొడిచేస్తోంది. గేటు దాటేంత వరకు తరిమి కొడుతోంది. ప్రహరీ గోడపై పహారా కాస్తోంది.
కోడి చేష్టలు సరదాగా ఉన్నా... రక్తం వచ్చేలా దాడి చేయడంతో గ్రామస్తులు ఆ ఇంటి వైపు చూసేందుకు జంకుతున్నారు.
Published Date : Wednesday, 1/2/2012 4:46 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |