ముందు చూపులేని నీటిపారుదలశాఖ
.jpg)
* చివరి ఆయకట్టుకు అందని నిజాంసాగర్ నీరు
* అయోమయంలో అన్నదాతలు
* మంత్రి ఇలాకాలో నీటి గొడవ
మంత్రి ఆదేశాలకు అధికారుల పని తీరుకు పొంతన లేకపోవడంతో అన్నదాతల పాలిట శాపంగా మారుతోంది. నీటి పారుదల శాఖ మంత్రి సొంత జిల్లాలో సాగునీటి సరఫరా విషయం వివాదానికి దారితీసింది. నిజాంసాగర్ చివరి ఆయకట్టుకు నీరందే అవకాశాలు లేకపోవడంతో రబీసాగుపై అయోమయం నెలకొంది. నిజామాబాద్ జిల్లా వర ప్రదాయని నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతాంగం పరిస్థితి దయనీయంగా మారుతోంది. సాగునీటి సామర్థ్యం తగ్గిపోవడంతో పంటల విస్తీర్ణం కుచించుకుపోతోంది.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1400 అడుగుల నీరుంది. ఇటీవల భారీ నీటి పారుల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి సమక్షంలో నీటి విడుదలపై రబీ ప్రణాళికను అధికారులు ఖరారు చేశారు. నిర్ణయించిన దానికంటే ఎక్కువ నీటిని విడుదల చేయడం. కాలువ పూడ్చకపోవడం, డిస్ట్రిబ్యూటరీ కాలువ మరమత్తులు చేపట్టకపోవడం వల్ల నీరు వృధా అయ్యింది.
వరినాట్లు కూడా ఆలస్యంగా కొనసాగాయి. దీంతో చివరి ఆయకట్టు మండలాల్లో ఇంకా వరినాట్లు పూర్తి కాలేదు. ఈ లెక్కన ఏప్రిల్ చివరి నాటికి సాగునీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. సాగర్ నీటి విడుదలలో లోపాలను అధికారుల మొండి వైఖరిని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎండగడుతున్నారు.
ఇప్పటికే రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కుతున్నారు. ఇటీవల జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో మంత్రి సుదర్శన్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వర్‌రావుల మద్య మాటల యుద్దం నడిచింది. నీటి కోసం రైతులతో కలిసి మంత్రిని నిలదీశారు. వరినాట్లు వేసుకుంటున్న చివరి ఆయకట్టు రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Published Date : Thursday, 2/2/2012 4:21 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |