Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
మూడేళ్ల వయస్సులో మేధావిగా పేరొందిన చిన్నారి
AA

* పలు దేశాల రాజధానుల పేర్లు ఠక్కున చెబుతున్న శ్రీచంద్ర
* ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు సైతం చిటికెలో వెల్లడి
* ఉన్నత విద్యావంతులు సైతం ఆశ్చర్యపోతున్న వైనం
* బాల మేధావిని తీర్చిదిద్దుతున్న తల్లిదండ్రులు


వివిధ దేశాల రాజధానుల పేర్లు, ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు గుక్క తిప్పుకోకుండా చెప్పడంలో ఈ చిన్నారిది అందె వేసిన చేయి. మూడేళ్ల వయస్సులో ఇంత మేథాసంపత్తి ప్రదర్శిస్తున్న ఈ బుడతడిని అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకు చెందిన భక్తగిరి, జ్యోతి దంపతుల పెద్ద కుమారుడు శ్రీచంద్ర వయస్సు మూడేళ్లు.

అపారమైన జ్ఞాపకశక్తి కల్గివున్న ఈ చిన్నారి, ప్రపంచంలోని పలు దేశాల రాజధానుల పేర్లు, ప్రముఖ రాజకీయ ప్రముఖుల పేర్లను అక్షరం పొల్లు పోకుండా గడగడా చెప్పేస్తున్నాడు. విద్యాధికులైన తల్లిదండ్రులు ఈ చిన్నారిలోని మేథా సంపత్తిని గ్రహించి పదును పెట్టడం మొదలెట్టారు. ఏం చదువుతావని ఎవరైనా ఈ బుడతడిని ప్రశ్నిస్తే ఐపిఎస్‌ అని ఠక్కున చెబుతున్నాడు. తమ కుమారుడిని తప్పక ఐపిఎస్‌ చదివిస్తామని తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు.

Published Date : Thursday, 2/2/2012 5:12 PM IST