పాదరసాన్ని ఘనరూపంలో మార్చి శివలింగం తయారీ
* విజయవంతమైన బొబ్బిలి యువకుడి ప్రయోగం
* తండ్రి ఆశయం నెరవేర్చానని శ్రీనివాస్ సంబరం
* పాదరస శివలింగాన్ని చూసి అబ్బురపడుతున్న గ్రామస్తులు
పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అంటారు పెద్దలు. అయితే, తండ్రి ఆశయం నెరవేర్చడానికి సరికొత్త ప్రయోగాన్ని ప్రారంభించి విజయం సాధించాడు. విజయనగరం జిల్లాకు చెందిన ఓ యువకుడు పాదరసం, వనమూలికలతో పలు ప్రయోగాలు చేసి పాదరస శివలింగం తయారు చేశాడు. వన మూలికలను ముందేసుకొని కల్వంలో అదేపనిగా నూరుతున్న ఇతని పేరు శ్రీనివాసరావు. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ఈ యువకుడు తండ్రి కలను నెరవేర్చాలని కంకణం కట్టుకుని, విజయం సాధించాడు.
పాదరసాన్ని ఘనరూపంగా చేసి శివలింగంగా మార్చాలని శ్రీనివాస్ తండ్రి ఎంతో ప్రయత్నం చేశాడు. అయితే, ఆయన కోరిక నెరవేరకుండానే కాలధర్మం చెందాడు. తండ్రి తలబెట్టిన మహత్తర కార్యాన్ని తాను పూర్తి చేయాలని శ్రీనివాస్ నిర్ణయించుకున్నాడు. వనమూలికలు, రసాయనాలు ఉపయోగించి పాదరసాన్ని ఘనీభవించే ప్రక్రియ చేపట్టి శివలింగాన్ని రూపొందించాడు. పాదరసంతో రూపొందించిన శివలింగాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
మరోవైపు తండ్రి ఆశయాన్ని నెరవేర్చానని శ్రీనివాస్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అయితే పాదరసంతో ప్రయోగాలు ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్న తన పట్టుదల ఈ విజయాన్ని అందించిందని శ్రీనివాస్ మాత్రం ఆనందపడుతున్నాడు.
Published Date : Thursday, 2/2/2012 5:26 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |