Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
బరువు లేపడంలో ప్రతిభాశాలి
AA

* ఎడ్లబండిని ఆలవోకగా లేపుతున్న అంజిరెడ్డి
* మోటారు సైకిళ్లను కావడిలా మోస్తున్న వైనం
* శిక్షణలేకనే ప్రతిభా విన్యాసాలు


ఆయనకు బరువులను ఎత్తడం హాబీగా ఎంచుకున్నాడు. ఎత్తటి బరువునైనా అవలీలగా ఎత్తటం ఆయనకు సాటిలేదు. చిన్నప్పటినుంచి బరువులను ఎత్తడం మహాసరదా. ఆ సరదా కాస్తా నేడు కండలబీముడుగా, వీరుడిగా పేరు సాధించి పెట్టింది. మోటర్‌సైకిళ్ళను, ఎండ్లబండ్లను పైకి లేపడాన్ని సరదాగా ఉంటుంది. ఈయన పేరు అంజిరెడ్డి. ఊరు నల్గొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెం. చిన్నప్పటినుంచి బరువులను లేపడాన్ని హాబీగా ఎంచుకున్నాడు. సరదాగా ఎంచుకున్న హాబీ ఇపుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

మారుమూల గ్రామంలో జన్మించిన ఆయన పవర్‌లిఫ్టర్‌గా జాతీయస్ధాయిలో ప్రతిభను చూపుతున్నాడు. ప్రత్యేకమైన శిక్షణలు ఏవీ తీసుకోలేదు. బాల్యం నుంచే పందెం.. పెద్ద పెద్ద రాతిగుండ్లు ఎత్తే అలవాటు ఉన్న ఆయన తర్వాత రాష్ట్ర, జాతీయ స్ధాయి పోటీల్లో ప్రతిభ కనబరచి శభాష్‌ అనిపించుకున్నాడు. పంటపొలాల్లో బురదలో ట్రాక్టర్ దిగబడితే ఒంటి చేత్తోలేపి సాయం చేసేవాడు. అలా అతడి ప్రతిభను గుర్తించిన గ్రామస్ధులు ప్రోత్సహంతో అంజిరెడ్డి జాతీయస్ధాయి పోటిల్లో పాల్గొని సత్తాచాటాడు.

గ్రామంలో బరువులను లేపే విన్యాసాలు చూపరులను ఆశ్చర్య పరస్తుంటాయి. ఎడ్లబండ్లను లేపడం, మోటారు సైకిళ్లను కావడిలా సులభంగా లేపేస్తుంటాడు. 1995లో ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన జాతీయస్ధాయి పవర్‌లిఫ్టింగ్ పోటిల్లో 605 కిలోల బరువు ఎత్తిన మేకల అంజిరెడ్డి ప్రధమస్ధానంలో నిలిచారు. 1996లో వైజాగ్‌లో నిర్వహించిన రాష్ట్రస్ధాయి పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 90 కిలోల బరువు ఎత్తి మరోసారి ప్రధమస్ధానాన్ని సుస్ధిరం చేసుకున్నాడు.

1997లో కేంద్రప్రభుత్వం యూత్‌ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్ శాఖ ఇండియన్ పవర్‌లిఫ్టింగ్ ఆధ్వర్యంలో ముంబైలో నిర్వహించిన అంతార్జాతీయ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో 580కిలోల బరువు ఎత్తి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఎలాంటి శిక్షణలేకుండానే బరువులను అవలీలగా లేపుతున్న అంజిరెడ్డిని ప్రోత్సహిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటొందని సర్వత్రా అభిప్రాయం వ్యక్త మవుతోంది.

Published Date : Friday, 3/2/2012 1:46 PM IST