Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
అడవుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
AA

* రాయలసీమలో అటవీశాఖ వినూత్న ప్రయోగం
* పర్యావరణ పరిరక్షణ లక్ష్యం
* నీలగిరి మొక్కల ఉత్పత్తికి ప్రాదాన్యత


కడపజిల్లాలో సామాజిక అడవుల అభివృద్ధికి అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. మొక్కల ఉత్పత్తికోసం నర్సరీలను ఏర్పాటుచేసి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రాయలసీమ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా సామాజిక అడవుల అభివృద్ధికి మొక్కలపెంపకం చేపడుతున్నారు. కడపజిల్లావ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న బీడుభూములను పచ్చని మొక్కలతో అభివృద్ధిచేసేందుకు అటవీశాఖ వినూత్న ప్రయోగం చేపట్టింది.

పొరుగుప్రాంతాలనుంచి మొక్కలను దిగుమతి చేసుకునే పద్ధతికి స్వస్తి చెప్పారు. శాఖాపరంగా ఏర్పాటు చేసుకున్న నర్సరీల్లో మొక్కలను వృద్ధి చేసుకునే దిశగా చర్యలు తీసుకున్నారు. తక్కువ ఖర్చుతో అటవీశాఖ మొక్కల ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. కడపశివారులోని రాజీవ్‌ స్మృతివనంలో ప్రత్యేక ఉత్పత్తికేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అటవీశాఖ కంఫా నిధుల్లో 12 లక్షలరూపాయల వ్యయంతో ఆధునిక పద్ధతుల్లో షెడ్లు నిర్మించారు.

ఇక్కడ ఉత్పత్తి చేసిన మొక్కలను కడప పరిసరాల్లోని బీడుభూముల్లో నాటబోతున్నారు. దశలవారీగా మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఎలాంటి వాతావరణానికైనా తట్టుకునే విధంగా నీలగిరి మొక్కలు పెంచడం శ్రేయోదాయకంగా ఉంటొందని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఒక్కో మొక్క ఉత్పత్తికి కేవలం ఒక్కరూపాయి మాత్రమే వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నీలగిరి చెట్ల పెంపకం పేపర్‌ తయారీకి అవసరమయ్యే ముడిసరుకుకోసం వినియోగించవచ్చని అధికారులు చెబుతున్నారు. మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణకు ప్రయోజనకరంగా ఉంటొందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Published Date : Friday, 3/2/2012 5:23 PM IST