అనంత పట్టణ టీడీపీలో కులపోరు
.jpg)
* ప్రభాకర చౌదరి రాకతో మారుతున్న సమీకరణాలు
* ఉప ఎన్నికలకు ముందే పెరిగిన గ్రూపులు
అనంత పట్టణ టిడిపిలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే తమ్ముళ్లు పావులు కదపడంతో ఉప ఎన్నిక నాటికి సీటు కోసం పోటీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కులాల పోరుగా దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనంత అర్బన్ స్థానానికి చెందిన ఎమ్మెల్యే గురునాథ రెడ్డి జగన్ పార్టీలోకి జంప్ కావడంతో, అనర్హత కింద స్పీకర్ వేటు వేస్తే ఉప ఎన్నిక అనివార్యం కానుంది.
గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీపడి ఓడిపోయిన మహలక్ష్మీ శ్రీనివాస్ తిరిగి ఈ ఎన్నికల్లో కూడా పోటీపడే అవకాశాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్లు చీలితే టిడిపి లబ్ది పొందే అవకాశాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. ఈ దశలో అనంతపురం మున్సిపల్ మాజీ ఛైర్మన్ ప్రభాకర చౌదరి తిరిగి టిడిపి గూటికి చేరడంతో సమీకరణాలు మారుతున్నాయి.
ఇంతకాలం మహాలక్ష్మి వెంట వున్న వారు ఇప్పుడు ప్రభాకర్ చౌదరి గూటికి చేరడంతో కుల సమీకరణాలు కూడా తెరపైకి వస్తున్నాయి. అంతేగాకుండా మహాలక్ష్మి శ్రీనివాస్ స్థానికేతరుడు అన్న ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ప్రభాకర చౌదరి తిరిగిపార్టీలోకి రావడం, మాజీ ఎంపీ సైపుల్లా కొడుకు జకీవుల్లా చురుకుగా టిడిపి రాజకీయాల్లో పాల్గొనడంతో ఇప్పుడు ఉప ఎన్నికల పోరు టిడిపికి తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. దీన్ని కులపోరుగా మార్చడంతో పట్టణ టిడిపిలో అంతర్గత కుమ్ములాటలు జరిగే ప్రమాదం కూడా లేకపోలేదని భావిస్తున్నారు.
Published Date : Friday, 3/2/2012 5:27 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |