తుంగభద్ర అధికారుల అలసత్వం

* పులివెందులకు నీటి కేటాయింపుల్లో అన్యాయం
* వేసవికి ముందు ముంచుకొస్తున్న నీటి ఎద్దడి
* మంచినీటి సమస్యను పరిష్కరించాలని వినతి
వేసవికి ముందే కడప జిల్లా ప్రజల గొంతెండుతోంది.పరిస్థితి ఇప్పుడే ఇలావుంటే భవిష్యత్లో ఇంకెలా ఉంటుందోనన్న ఆందోళన మొదలయ్యింది. ముఖ్యంగా పులివెందుల ప్రాంతంలో తుంగభద్ర నీటి కేటాయింపుల్లో అన్యాయంతో సాగు, తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్ ద్వారా ప్రజలకు తాగునీరు, సాగునీరు అందిస్తున్నారు.
తుంగభద్ర అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు నీటి విడుదల కాకపోవవడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో వేసవికి ముందే ఇక్కడ సాగు, తాగునీటికి ఎద్దడి ఏర్పడింది. తుంగభద్ర నుంచి చిత్రావతి రిజర్వాయర్‌కు వచ్చిన నీటినుంచి 2.5 టిఎంసిలు సాగునీటి అవసరాలకు, 0.9 టిఎంసిలు పులివెందుల పట్టణ ప్రజల తాగునీటి అవసరాలకు కేటాయించాలి. అయితే ఈ ఏడాది సాగునీరు అందకపోగా, తాగునీటి విడుదల కూడా ప్రశ్నార్థకంగా మారింది.
దీంతో ప్రజలు , నేతలు ఆందోళనకు దిగడంతో కేవలం వారం రోజులు మాత్రమే నీరు విడుదల చేశారు. అయితే ఈ నీరు ఏ మాత్రం సరిపోలేదు. ప్రస్తుతం కామసముద్రం, నక్కలపాడు సమ్మర్ స్టోరేజీల్లో నిల్వలు అడుగంటాయి.ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్రయంచినీటి ఎద్దడి ఏర్పడగలదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.
Published Date : Saturday, 4/2/2012 3:31 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |