స్త్రీ నిధిలో మహబూబ్‌నగర్‌కు మొండిచేయి

* ఆవేదన చెందుతున్న మహిళా సంఘాలు
అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఫలాలు మహిళల చెంతకు చేరడం లేదు. గ్రామాల్లోని పేదలను అత్యవసర సమయాల్లో ఆదుకునేందుకు ఉద్దేశించిన స్త్రీ నిధి పథకం మహబూబ్‌నగర్ జిల్లా మహిళలను నిరాశపరచింది. మహిళలను ఊరించిన పథకం ఊసురోమనిపించింది. కరువు, పేదరికంతో ఉన్న మహిళలను ఆదుకోడానికి ఉద్ధేశించిన స్త్రీనిధి పథకం మహబూబ్‌నగర్ వాసులను నిరాశపరచింది.
జిల్లాలో గ్రామీణ నిరుపేద మహిళలు వడ్డీ వ్యాపారుల భారిన పడకుండా ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన పథకం అందుబాటులోకి రాలేకపోయింది. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా తిరిగి చెల్లిస్తున్న సంఘాలకు మాత్రమే ఈ పథకం వర్తింపజేసేట్లు చేశారు. అయితే గతేడాది బ్యాంకుల నుంచి 16788 మహిళ సంఘాలకు....280 కోట్ల రూపాయలను రుణాలుగా అందజేశారు.
ఇందులో దాదాపు 94 శాతం సంఘాల తీసుకున్న రుణాలకు తిరిగి క్రమం తప్పకుండా చెల్లిస్తూ వస్తున్నాయి. ప్రతి మండల మహిళా సమాఖ్యలకు ఉన్న కార్పస్ ఫండ్‌ను నిల్వ చేయకపోవడం వల్లే ఈస్త్రీనిధి పథకానికి అనేక మండలాలు ఎంపిక కాలేకపోయాయి. లాభాలకంటే...ఖర్చులు అధికంగా చూపడంతో అన్యాయం జరిగిందని మహిళలు ఆవేదనకు గురవుతున్నారు. మహబూబ్‌నగర్‌జిల్లా లో స్త్రీ నిధిని ఏర్పాటు చేయాలని మహిళలు కోరుతున్నారు.
Published Date : Saturday, 4/2/2012 3:44 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |