ప్రభుత్వ భూములు పరాధీనం
* రియల్ ఎస్టేట్ విస్తరణతో పెరిగిన ధరలు
* అధికారుల అండదండలతో రియల్టర్ల ఇష్టారాజ్యం
* కబ్జాపర్వంలో పేదల భూములు
ప్రభుత్వ భూములు పరులకు ఫలహారమవుతున్నాయి. డాక్యుమెంట్లు లేకుండానే పలుకుబడితో అమ్మి సొమ్ముజేసుకుంటున్నారు. అధికారుల అండ... రాజకీయనాయకుల భరోసాతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రభుత్వ భూములు మాయమవుతున్నాయి. పేదలకు ఇచ్చిన భూములుకూడా కబ్జా కోరల్లో చిక్కుకు పోతున్నాయి. ఇది వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణం. అటు నెల్లూరు, ఇటు కడప జిల్లాకు సరిహద్దుల్లో వుంది,. ఈ నియోజక వర్గంలో ప్రయివేటు భూములు ౩౦ శాతం అయితే ప్రభుత్వ భూములు 70శాతం వున్నాయి.
కొన్నేళ్లుగా ఇక్కడ అక్రమ భూ వ్యాపారం ఎధేచ్చగా సాగుతోంది. రాజకీయ అండదండలు.. అధికారుల భరోసాతో ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేయడం.. వాటిని కోట్లరూపాయలకు అమ్ముకోవడం జరుగుతోంది. రెవెన్యూ అధికారులతో చెక్ బందీ సర్టిఫికెట్ లు, డీకేటి పట్టాలు తీసుకున్న స్ధలాలకైతే విపరీతమైన ప్రాధాన్యత వుంది. సోమశిల ప్రాజెక్ట్ కు సమీపంలో వున్న ఈ ప్రాంతం లో ముంపు వాసులకు గత పదేళ్ల క్రితం ఇళ్ల స్ధలాలు ఇచ్చారు. వాటిలో 70 శాతానికి పైగా చేతులు మారాయి.
బద్వేలు, గోపవరం తదితర ప్రాంతాల్లో భూముల స్ధలాలు వందల కోట్లు ఖరీదు చేస్తున్నాయి. రెవెన్యూ అధికారులకు ముడుపులు ముట్టజెప్పడం ఎప్పడో డీ కేటి పట్టాలు పొందినట్లు రికార్డులు తయారు చేసుకోవడం వాటిని కోట్ల రూపాయలకు అమ్ముకోవడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న రెవెన్యూ సదస్సులలో ఈ విషయాలన్ని వివాదాల రూపంలో బయటకు వస్తున్నాయి. ప్రభుత్వ భూములతో కోట్ల వ్యాపారం చేస్తున్న కేటు గాళ్ల పై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Published Date : Wednesday, 8/2/2012 4:55 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |