అధికారుల నిర్లక్ష్యంతో ఫ్యాక్టరీ మూసివేత
రైతులకు వరదాయనిలా ఉండే ఓ ప్రభుత్వ ఫ్యాక్టరీలో... దశాబ్దాలుగా పాలనా వ్యవహారం దెబ్బతింది. దీంతో..ఉద్యానవన పంటల రైతులు ...ఫలసాయాన్ని ఏం చేసుకోవాలో తెలీక నానా అవస్థలు పడుతున్నారు. ఒకప్పుడు వై.ఎస్.ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట ప్రభుత్వ అప్స జ్యూస్ ఫ్యాక్టరీ రైతులు పండించిన పంటకు ఎంతో ఆసరాగా ఉండేది. రైల్వేకోడూరు,రాజంపేట,పులివెందుల ప్రాంతాల్లో విస్తారంగా పండించే ఉద్యానవన పంటల రైతులు ఫలసాయాన్ని ఈ ఫ్యాక్టరీకి అమ్ముకునేవారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పాలనా వ్యవహారం దెబ్బతినడంతో ఫ్యాక్టరీని మూసివేశారు. 1935 లో అప్స జ్యూస్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి జవహర్ లాల్ నెహ్రూ కూడా విచ్చేశారు. అప్పట్లో దాదాపు వెయ్యిమంది వరకు ఈ ఫ్యాక్టరీ ద్వారా లబ్ది పొందేవారు. 63 సంవత్సరాలు నిరాటంకంగా ఈ ఫ్యాక్టరీ నడిచింది. రైతులు, ఉద్యోగులు దీనిని నమ్ముకుని బ్రతికేవారు. తరువాత నష్టాలు వస్తున్నాయన్న సాకుతో దీనిని మూసివేశారు. కొంతకాలం తర్వాత ప్రైవేటు వ్యక్తులకు లీజు ఇచ్చినా నిర్వహించలేకపోటంతో మళ్లీ మూతపడింది. ఇటీవల కాలంలో ఏకంగా ఈ ఫ్యాక్టరీని అమ్మేయాలన్న ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే తక్కువ ధరకు ప్రభుత్వాన్ని ఒప్పించి అప్పనంగా కొనేందుకు కొందరు బడాబాబులు ప్రయత్నాలు చేస్తన్నారని వాపోతున్నారు అక్కడి రైతులు. ప్రయివేట్ వ్యక్తులకు అమ్మకుండా ప్రభుత్వమే పున:ప్రారంభించి తమను ఆదుకోవాలని ఉద్యానవన రైతులు కోరుతున్నారు. ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తే నిరుద్యోగులైన తమకు ఉపాధి కలుగుతుందని నిరుద్యోగ యువత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అప్స జ్యూస్ ఫ్యాక్టరీని అమ్మకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని తిరిగి ప్రారంభించి తమకు సాయం చేయాలని కోరుతున్నారు వైఎస్‌ఆర్ కడప జిల్లా రైతులు.
Published Date : Friday, July 23, 07:51pm IST
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


