Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
కడపలో అస్థవ్యస్థమైన డ్రైనేజీ వ్యవస్థ..!
AA


అధికారుల నిర్లక్ష్యం ... ప్రజల పాలిట శాపంగా మారుతోంది. అవినీతి అధికారులు కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తుండటంతో ... చినుకు పడితే చిత్తడయ్యే రోడ్లు, అస్ధవ్యస్ధమైన డ్రైనేజీ వ్యవస్ధలతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లాలోని జమ్మలమడుగు పట్టణ దుస్ధితిపై టీవీ5 స్పెషల్‌. వైఎస్‌ఆర్‌ జిల్లాలోని పెద్ద పట్టణాల్లో జమ్మలమడుగు ప్రధానమైనది. మున్సిపాల్టీ స్ధాయికి ఎదిగినా జమ్మలమడుగు మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. అక్కడి రోడ్లు నామరూపాలు లేకుండా పోయాయి. అస్ధవ్యస్ధమైన డ్రైనేజీ వ్యవస్ధతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది.

దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీటి కాల్వలు నిర్మించినా నాణ్యత లేకపోవడం ...వాటి పనులు అరకొరగా చెయ్యడంతో ... అవి ఉన్నా ఉపయోగం లేకుండా పోతోంది. దళిత వాడల్లో రోడ్లపైనే ముళ్ళపొదలు అలుముకున్నాయి. డివైడర్లు అత్యంత నాసిరకంగా నిర్మించడంతో ... ఒకవైపు కడుతుంటే ... మరోవైపు పడపోతున్నాయి. డివైడర్లు దెబ్బతిన్నచోట కనిపించకుండా రంగులు పూసి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు అధికారులు.

డివైడర్‌ పనులు అధికార పక్షం నాయకుల అనుచరులు కాంట్రాక్టుకు తీసుకుని నిర్మిస్తుండటంతో ... వారిని అడిగే నాధుడే కరువయ్యాడు. అడుగడుగునా అధికారుల అవినీతితో కష్టాలు పడుతున్నామంటున్నారు స్ధానికులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అవినీతి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తమ కనీస సౌకర్యాలు ఏర్పాటుచేయాలని వేడుకుంటున్నారు

Published Date : Wednesday, Aug 11, 06:58pm IST

Watch Video....