సందర్శకులను అలరిస్తున్నసీతాకోక చిలుకల పార్కు
కడప యోగివేమన యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన సీతాకొక చిలుకల పార్కు విద్యార్ధులతోపాటు సందర్శకులను ఎంతాగానో అలరిస్తోంది. చిన్న చిన్న సీతాకొక చిలుకలు రంగురంగుల అందమైన రెక్కలతో ఎగురుతూ.... సందర్శకుల మనస్సు దోచుకుంటున్నాయి. కడప యోగివేమన యూనివర్సిటిలో సీతాకొక చిలుకలు సందడిచేస్తున్నాయి. యునివర్సిటీ జువాలజీ అసిస్టెంట్ ప్రొపెసర్ వెంకటరమణ సీతాకొక చిలుకల పార్కును ఏర్పాటుచేశారు. వీటిపై ఆయన పరిశోధనలుకూడా చేస్తున్నారు.
విద్యార్ధులు పరిశోధనలకు అనుకూలంగా దీనిలో 25జాతుల బటర్ ఫ్లై లను ఉంచారు. వీటి జీవితకాలం ఒకరోజునుంచి ఏడురోజులవరకు ఉంటుంది. 40రోజుల పాటు వీటి పరిణామక్రమం జరుగుతుంది. వీటిల్లో యురీమా, లెప్టోసియా కుటుంబాలకు చెందిన అతిచిన్న సీతాకొక చిలుకల జీవితకాలం కేవలం 24నుంచి 34 గంటలుమాత్రమే.... గుడ్డు దశనుంచి లార్వ,పీపా, సీతాకొక చిలుక దశలుమారేంత వరకు వీటిపై పరిశోధనలు చేయడానికి ఇక్కడ ఏర్పాట్లు చేశారు.
అయితే మనరాష్ట్రంలో 125 జాతుల సీతాకొక చిలుకలు ఉండగా....వీటిలో ఇప్పటివరకు 90 జాతులను మాత్రమే గుర్తించగలిగారు.సీతాకొక చిలుకలు మొక్కల్లో పరపరాగ సంపర్కానికి ప్రధాన పాత్ర పోషించి, తద్వారా పుష్పాలు, పలాలు ఏర్పడేందుకు దోహద పడుతాయి. ఇవి రైతులకు, పళ్లతోటలకు ఎంతో మేలుచేస్తాయి. పంట పొలాలకు రైతులు ఉపయోగిస్తున్న రసాయనాల కారణంగా చాలా రకాల సీతాకొకచిలుకలు అంతరించి పోయే దశకు వచ్చాయని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అయితే ఈ పార్కును తిలకించి పులకించిపోయిన విద్యార్ధులు తమపరిశోధనలకు ఈ సీతాకొక చిలుకల పార్కు ఎంతో ఉపయోగ పడుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణాన్ని రక్షించేందుకు, సీతాకొక చిలుకలపై పరిశోధనలను ప్రోత్సహించేందుకు పార్కుకు నిధులు కెటాయించి, అభివృద్దిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ వేత్తలు, స్థానిక ప్రొపెసర్లు కోరుతున్నారు.
Published Date : Wednesday, Aug 11, 07:00pm IST
Watch Video....
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


