Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
అధికారుల నిర్లక్ష్యం ప్రజలపాలిట శాపం..!
AA


అధికారుల నిర్లక్ష్యం ప్రజలపాలిట శాపంగా మారింది. అన్నదాతల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.వైఎస్‌ఆర్‌ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు మరమత్తు పనులు వర్షా కాలంలో చేపట్టారు. దీంతో ..పనులు పూర్తికాక,ప్రాజెక్టులో నీరు నిలువ లేక ఆయకట్ట రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల అలసత్వం కారణంగా వైఎస్‌ఆర్‌ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు ఆయకట్టకు ఖరీఫ్‌లో నీరు అందే పరిస్ధితి కనిపించడం లేదు. 2.24టియంసి సామర్ధ్యం కలిగిన అన్నమయ్య ప్రాజెక్టు కింద 22వేల 5వందల ఎకరాల ఆయకట్టు ఉంది. అంతేకాక రాజంపేట, పుల్లంపేట మండలాల్లోని 18గ్రామాల తాగునీటి పధకాలు కూడా అన్నమయ్య ప్రాజెక్టుమీదే ఆధారపడి ఉన్నాయి.

2001లో నిర్మాణం పూర్తైన ఈప్రాజెక్టు నుంచి చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందించడంలో అధికార యంత్రాంగం ఎప్పుడూ విఫలమవుతూనే ఉంది. పాక్షికంగా పట్టు తప్పిన నాలుగు గేట్లకు మరమత్తులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపారు. దీంతో గేట్ల ద్వారా నీరు లీకై వృధాగా పోతోంది. అయితే ఆలస్యంగా నిద్రలేచిన అధికారులు ఇప్పుడు గేట్ల మరమత్తులు చేపట్టారు. ఈ ఏడాది ఆఖరు కల్లా మరమత్తు పనులు పూర్తిచేస్తామని చెప్తున్నారు. అయితే ఈ ఏడాది సాగునీరు అందే సూచనలు కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందే మేల్కుంటే తమకు ఇలాంటి దుస్ధితి వచ్చేది కాదని రైతులు మండిపడుతున్నారు. అయితే భవిషత్‌లోనైనా సాగునీటికి ఇబ్బందులు రాకుండా చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

Published Date : Friday, Aug 27, 09:24pm IST

Watch Video....