Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
భారీ వర్షాలకు పరవళ్లు తొక్కుతోన్న"కుందూనది"
AA


భారీ వర్షాలకు కుందూ నది పరవళ్లు తొక్కుతోంది. వరద నీటి ప్రవాహానికి... నది ఉగ్రరూపం దాల్చడంతో... గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ప్రజలు ముంపుకు గురై... అల్లాడుతున్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కుందూ నదికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది.ఈనేపథ్యంలో.. పెద్దముడియం, ప్రొద్దుటూరు, చాపాడు, దువ్వూరు మండలాల్లోని 27 గ్రామాలు ముంపుకు గురైయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే దరిశలూరు, నాగరాజుపల్లె, పాలూరు గ్రామాలు జలదిగ్భందంలో చిక్కకున్నాయి. నెమళ్లదిన్నె వద్ద... కుందూనది.. బ్రిడ్జిపై నుంచి పొంగి ప్రవహిస్తోంది. గ్రామాల్లోని వందల ఎకరాల పంటపొలాలు నీట మునిగాయి. దువ్వూరు మండలం వెల్లాల వద్ద బ్రిడ్జి మునిగిపోవడంతో ప్రొద్దుటూరు, చాగలమర్రి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి మరింత పెరిగితే... దువ్వూరు మండలంలోని పెద్దజొన్నవరం, నేలటూరు, కానగూడూరు గ్రామాలు నీట మునిగే అవకాశం ఉంది. దీంతో గ్రామస్థులు ఇన్‌చార్జి తాహశీల్ధార్‌ను నిలిదీశారు. కుందూ నది వరదపై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్‌ గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వరద బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా వరదల కారణంగా... ఆస్థినష్టం, ప్రాణ నష్టం జరుగుతోందని... ఈ నేపథ్యంలో..ప్రభుత్వం తమకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

Published Date : Friday, Aug 27, 10:24pm IST

Watch Video....