చదరంగంలో ప్రతిభ కనపరుస్తున్న వంట మాస్టర్
హోటల్‌ల్లో క్లీనింగ్ బాయ్‌గా జీవినం సాగించిన ఆ యువకుడు... కాలనుగుణంగా.... అక్కడే వంట మాస్టర్ అయ్యాడు. తన చేతి వంటను అందరికీ రుచి చూపడంతో పాటు...తనలో దాగి ఉన్న ప్రతిభకు కూడా పదును పెట్టాడు. చదరంగంలో అంతర్జాతీయ రేటింగ్ సాధించి... అందరికీ ఆదర్శంగా నిలిచాడు. వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగు పట్టాణానికి చెందిన ఇతని పేరు ఖాసీం. పేద కుటుంబంలో జన్మించిన ఈ యువకుడు....ఆర్ధిక పరిస్థితుల కారణంగా చదువుకోలేదు. ఓ హోటల్లో క్లీనింగ్ బాయ్‌గా పని చేస్తూ...కుటుంబానికి ఆసరాగా నిలిచి... కొన్నాళ్లకు అదే హోటల్లో వంట మాస్టరయ్యాడు. అయితే...తన ఇంటి వద్ద కొందరు రోజూ చదరంగం ఆడటం చూసి..ఆ క్రీడపై ఆసక్తి పెంచుకున్న ఖాసీం... ఆటపై పట్టు సాధించాడు. కడపలో జరిగిన చదరంగం టోర్నమెంట్స్‌లో పాల్గొని మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాక ఇటీవల చెన్నైలో జరిగిన హోంలాండ్ ఫిడే రేటింగ్ టోర్నమెంట్‌లో పాల్గొని... అంతర్జాతీయ రేటింగ్ సాధించి సంచలనం సృష్టించాడు. తొమ్మిది మంది అంతర్జాతీయ రేటింగ్ క్రీడాకారులతో ఆడి...వారిని చిత్తుగా ఓడించి...1535 అంతర్జాతీయ రేటింగ్‌ను కైవనం చేసుకున్నాడు. చదరంగంలో ప్రతిభ కనబరచిన ఖాసీం... భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించి... దేశానికి మంచి పేరుతెస్తాడని స్థానికులు భావిస్తున్నారు. అతనికి ప్రభుత్వం సాయం అందించి.... చేయూతనివ్వాలని కోరుతున్నారు.
Published Date : Monday, Aug 30, 06:30Pm IST
watch video.....
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


