Heart Diseases: 50 ఏళ్లు కూడా లేవు.. ఎందుకీ గుండె నొప్పులు..

Heart Diseases: 50 ఏళ్లు కూడా లేవు.. ఎందుకీ గుండె నొప్పులు..
పట్టుమని పాతికేళ్లు లేవు.. పరిగెడుతూ పడిపోయిన సంఘటనలు చూస్తున్నాము.. ఆస్పత్రికి తీసుకెళ్తే సడెన్ స్ట్రోక్ రావడంతో కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడని వివరిస్తున్నారు.

Heart diseases: పట్టుమని పాతికేళ్లు లేవు.. పరిగెడుతూ పడిపోయిన సంఘటనలు చూస్తున్నాము.. ఆస్పత్రికి తీసుకెళ్తే సడెన్ స్ట్రోక్ రావడంతో కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడని వివరిస్తున్నారు. గుండెపోటులు, స్ట్రోకులు, ఇతర అనేక రకాల గుండె జబ్బులకు ప్రస్తుత రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ఉంటోంది. ఫిట్‌నెస్ మీద శ్రద్ధ కనబరిచే వారు కూడా గుండె పోటుకు గురవడం ఆందోళన కలిగించే అంశం.

50 సంవత్సరాల వయస్సులో గుండె జబ్బులు రావడానికి ఇక్కడ ఐదు కారణాలు ఉన్నాయి:

ధూమపానం

యువతలో కొరోనరీ ఆర్టరీ వ్యాధికి అతి పెద్ద ప్రమాద కారకాల్లో ఒకటి స్మోకింగ్. ధూమపానం చేసే వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివిధ అధ్యయనాల ప్రకారం, ఈ అలవాటు గుండెకు సంబంధించిన ప్రమాదాన్ని 8 రెట్లు పెంచుతుందని కనుగొన్నారు.

స్మోకింగ్ అలవాటు ఉన్నవారు వయసులో చిన్నవారైనా గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఇది చాలా శక్తివంతమైన ప్రమాద కారకం. మీరు గుండెపోటును నివారించాలనుకున్నట్లైతే పొగ త్రాగడం వీలైనంత వరకు నిరోధించాలి.

గర్భధారణ సమస్యలు

గర్భధారణ సమయంలో మధుమేహం, అధిక బరువు పెరగడం, ముందస్తు ప్రసవానికి గురయ్యే మహిళలకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ధమని సంబంధిత సమస్యలు సాధారణంగా గర్భధారణ సమయంలో ఎక్కువగా వస్తాయని న్యూజెర్సీలోని ప్రిన్స్టన్‌లోని మహిళా హెల్త్‌కేర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మరియా సోఫోక్లెస్ అన్నారు.

మహిళలు గర్భధారణ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటే వారి డాక్టర్ లేదా కార్డియాలజిస్ట్‌తో కూడా గుండె సంబంధిత సమస్యల గురించి మాట్లాడాలని ఆమె అన్నారు.

"తల్లి లేదా బిడ్డ యొక్క వాస్కులర్ వ్యవస్థ దెబ్బతినడం వలన ముందస్తు ప్రసవం తరచుగా జరుగుతుంది. రక్త నాళాలు గర్భధారణకు మద్దతు ఇవ్వలేనందున ఇది తరచుగా జరుగుతుంది'' అని ఆమె అన్నారు.

కుటుంబ హైపర్ కొలెస్టెరోలేమియా (FH)

అధిక కొలెస్ట్రాల్ కూడా గుండె జబ్బులకు ప్రధాన కారణం. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్, లేదా "చెడు" LDL కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు దారి తీస్తుంది. కుటుంబంలో హైపర్ కొలెస్ట్రాలో ఎవరికైనా ఉన్నప్పుడు ఆ ఇంట్లో పుట్టిన చిన్నారుల్లో ఎవరో ఒకరికి చిన్న వయస్సు నుండే అధిక కొలెస్ట్రాల్ ఉంటుంది.

250 మందిలో ఒకరికి FH ఉంటుంది. ఇది సాధారణంగా ఎథెరోస్క్లెరోసిస్ వంటి అధిక కొలెస్ట్రాల్‌తో సంబంధం ఉన్న సమస్యలకు దారితీస్తుంది. FH ఉన్న పురుషులలో సగం మందికి 50 ఏళ్లు రాకముందే గుండెపోటు సమస్యలు తలెత్తితే మహిళల్లో ముప్పై శాతం మందికి 60 ఏళ్లు వచ్చేలోపు గుండెపోటు వస్తుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, ముఖ్యంగా సోడియం తీసుకోవడం తగ్గించుకోవడం వంటి జీవనశైలి మార్పులను చేయడం వల్ల రక్తపోటును నివారించవచ్చు.. తద్వారా గుండె పోటు సమస్యలను దూరం చేసుకోవచ్చు.

డిప్రెషన్

బరువైన హృదయం మనస్సునే కాదు మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. డిప్రెషన్ ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. ధమనుల సంకోచానికి కారణమయ్యే రసాయనాలను పెంచుతుంది. ఇది శారీరక ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని మిస్సౌరీలోని ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ గజాలా పర్విన్ అన్నారు.

"మీరు నిరాశకు గురైతే, అది మీ జీవనశైలిని ప్రభావితం చేస్తుంది. ఆ సమయంలో సరిగా ఆహారం తీసుకోరు, వ్యాయామం చేయరు, నిద్ర పట్టదు. ఈ పరిణామాలన్నీ మొత్తంగా మీ ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపిస్తాయి.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. డిప్రెషన్ లేదా బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న టీనేజ్ యువత గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని కనుగొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story