6 Seeds for Hair Growth: ఆరోగ్యమైన జుట్టు కోసం ఆరు విత్తనాలు.. రోజూ తీసుకుంటే..

6 Seeds for Hair Growth: ఆరోగ్యమైన జుట్టు కోసం ఆరు విత్తనాలు.. రోజూ తీసుకుంటే..
6 Seeds for Hair Growth: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సరైన జీవనశైలిని అనుసరించడం ద్వారా మీ హెయిర్ గ్రోత్ కూడా బావుంటుంది.

6 Seeds for Hair Growth:ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సరైన జీవనశైలిని అనుసరించడం ద్వారా మీ హెయిర్ గ్రోత్ కూడా బావుంటుంది. జుట్టుకు సరైన పోషణ అందించకపోతే వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఆహారంలో కొన్ని పోషకవిలువలు ఉన్న విత్తనాలను జోడించడం ద్వారా జుట్టు కుదుళ్లు గట్టిపడతాయి. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.

ఈ గింజలను పచ్చిగా లేదా ఉడికించి తినవచ్చు, కానీ వాటిని ఎప్పుడో ఒకసారి కాకుండా ప్రతి రోజు తగు మోతాదులో తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆరోగ్యకరమైన, బలమైన జుట్టు కోసం నిపుణులు సిఫార్సు చేసిన ఆరు సీడ్స్ గురించి తెలుసుకుందాం.

1. నువ్వులు

నలుపు లేదా తెలుపు ఏవైనా తీసుకోవచ్చు. ఈ విత్తనాలు జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో ఉన్న ఖనిజాలు, విటమిన్లు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, కొలెస్ట్రాల్ ని తగ్గించే ఫైటోస్టెరాల్స్ యొక్క గొప్ప మూలం. ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో, రక్తపోటును మెరుగుపరచడంలో, హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. మీరు వాటిని లడ్డూ రూపంలో తయారు చేసి తీసుకోవచ్చు లేదా మీ రోజువారీ వంటల్లో కూడా వాడవచ్చు.

2. సన్‌ఫ్లవర్ సీడ్

ఈ విత్తనాల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే విటమిన్ E, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జింక్ ఇందులో ఉన్నాయి. మీరు వాటిని స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు.

3. గుమ్మడి గింజ

జింక్, సెలీనియం, రాగి, మెగ్నీషియం, ఇనుము, కాల్షియం, విటమిన్లు A, B, C వంటి పోషకాల నిధి - గుమ్మడి గింజలు. ముఖ్యంగా అధిక టెస్టోస్టెరాన్ కారణంగా బట్టతలతో బాధపడే పురుషులలో, జుట్టు పల్చబడడాన్ని అరికట్టడంలో ఇవి సహాయపడతాయి.

4. ఫ్లాక్స్ సీడ్

అవిసె గింజల్లో మొక్కల ఆధారిత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అధికంగా ఉంటుంది. జుట్టు రాలడాన్ని తగ్గించే ప్రధాన వనరు ఒకటి. అవి అదనంగా ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్‌లు పుష్కలంగా ఉంటాయి.

5. మెంతులు

మెంతి విత్తనాలు పేస్ట్‌గా చేసి హెయిర్ మాస్క్‌గా ఉపయోగించుకోవచ్చు. విత్తనాలను రాత్రి పూట నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగి, ఆ గింజలను కూడా తినేయొచ్చు. ఈ గింజల్లో ప్రొటీన్, నియాసిన్, అమినో యాసిడ్‌లు, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి - ఇవన్నీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. కూరల్లో కూడా మెంతి పొడిని వేసే కూరకి రుచి వస్తుంది.. జుట్టుకి ఆరోగ్యాన్ని ఇస్తుంది.

6. చియా సీడ్స్

చియా గింజలు కూడా, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌లో పుష్కలంగా ఉంటాయి. ఈ గింజల్లో ఫైబర్, ప్రోటీన్, ఇతర ముఖ్యమైన ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఇవి గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

బాదం, వేరుశెనగ వంటి గింజల్లో కూడా పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు ఆరోగ్యాన్ని ఇస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story