Kitchen Tips: ఈతరం వనితల కోసం ఈజీ టిప్స్..

Kitchen Tips: ఈతరం వనితల కోసం ఈజీ టిప్స్..
ఆధునిక మహిళ అన్ని రంగాల్లో ముందుంది. మహిళలు వంటింటి మహారాణులే అయినా.. ఆఫీస్‌కి వెళ్లాలంటే అరగంట పట్టే పని

Kitchen Tips: ఆధునిక మహిళ అన్ని రంగాల్లో ముందుంది. మహిళలు వంటింటి మహారాణులే అయినా.. ఆఫీస్‌కి వెళ్లాలంటే అరగంట పట్టే పని అర నిమిషంలో అయిపోతే బావుండనుకుంటారు.. ఈజీ టిప్స్ ఎవరూ చెప్పినా ఆచరణలో పెట్టేస్తారు. మరి మీ కోసమే మరికొన్ని టిప్స్.. పనికొస్తాయేమో చూడండి..

1.ఉల్లిపాయలను కట్‌ చేసేటప్పుడు కళ్ళు మండకుండా ఉండాలంటే.. వాటిని కాసేపు చల్లని నీటిలో ఉంచాలి.. లేదా.. కాసేపు వాటిని ఫ్రీజర్‌లో ఉంచితే సరిపోతుంది.

2. ఉల్లిపాయలు తరిగాక చేతులు ఉల్లి వాసన రావడం సహజం.. తాజా నిమ్మరసం చేతులకు పట్టిస్తే ఉల్లి వాసన తొలగిపోతుంది.

3.అప్పుడప్పుడు ఉప్పు షేకర్‌లోని ఉప్పు ముద్దలుగా మారి బయటికి సరిగా రాదు. అలాంటప్పుడు దానిలో నాలుగు బియ్యం గింజలు వేస్తే ఉప్పు సులభంగా బయటికి వస్తుంది.

4. గ్లాస్ లు, స్టీల్ గిన్నెలు ఒకదాంట్లో ఒకటి ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఆ సమయంలో పై గ్లాసును చల్లటి నీటితో నింప్పి వేడి నీటిలో కాసేపు ఉంచితే ఇరుక్కున్న గ్లాసు ఈజీగా వచ్చేస్తుంది.

5. మాంసాన్ని వేయించేటప్పుడు అది బంగారు గోధుమ రంగులోకి రావడానికి దానిపై మిరపకాయను చిన్నగా తిరిమి చల్లితే చాలు.

6. ఉడకబెట్టిన అన్నంలో కొన్ని నిమ్మ రసం చుక్కలు వేస్తే.. అన్నం పొడిపొడిగా వస్తుంది.. తెల్లగా మల్లెపూవు లాగా కూడా ఉంటుంది.

7.అవెన్‌లో బ్రెడ్‌ని కాల్చేటప్పుడు, బ్రెడ్‌తో పాటు చిన్న గినెలో నీరు ఉంచితే.. బ్రెడ్‌ గట్టిగా అవదు. ఇంకా గోధుమ రంగులోకి మారకుండా సహాయపడుతుంది.

8.వేడి నూనె త్వరగా చల్లబడకుండా ఉండాలంటే, వేయించడానికి ముందే పాన్‌లో కొద్దిగా ఉప్పు లేదా పిండిని చల్లితే నూనె ఎక్కువ సేపు వేడిగా ఉంటుంది.

9. పాస్తా ఉడికించినప్పుడు ముద్దలా అవుతోందా.. అయితే అవి ఉడికించే గిన్నెలో ఓ చెక్క స్పూన్ కానీ ఫోర్క్ కానీ వేస్తే సరి..

10. చేపలు, క్యాబేజీ వంటివి ఉడికించేటప్పుడు వాసన వస్తుంటాయి. ఇలా వాసన రాకుండా ఉండాలంటే వంట చేసేటప్పుడు స్టవ్ పక్కన ఓ గిన్నెలో వెనిగర్ వేసి ఉంచితే సరి. వెనిగర్ వాటి వాసనని గ్రహించి మనకి ఆ స్మెల్ రాకుండా చేస్తుంది.


Tags

Read MoreRead Less
Next Story