Aam Panna: వేసవి స్పెషల్.. వేడిని తగ్గించే ఆమ్ పన్నా.. ఇంట్లోనే ఈ విధంగా..

Aam Panna: వేసవి స్పెషల్.. వేడిని తగ్గించే ఆమ్ పన్నా.. ఇంట్లోనే ఈ విధంగా..
Aam Panna: హీట్ స్ట్రోక్ నుండి ఉపశమనం కలిగించడంతో పాటు జీర్ణ సమస్యలకు కూడా అద్భుతంగా పని చేస్తుంది ఆమ్ పన్నా. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Aam Panna: ఆమ్ పన్నా, వేసవిలో తయారు చేసుకునే ప్రత్యేక పానీయం. విటమిన్ B1 , B2, నియాసిన్, విటమిన్ C లకు మంచి మూలం

వేసవి వచ్చిందంటే , పచ్చి, పండిన మామిడితో తయారు చేసిన అనేక వంటకాలు నోరూరిస్తుంటాయి. పండ్లకే రారాజు మామిడి పండు. వేడిని తట్టుకోవడానికి పచ్చి మామిడి, పుదీనా ఆకులతో చేసిన ఆమ్ పన్నా శరీరం డీహైడ్రేషన్ కి గురికాకుండా చూస్తుంది. ఆమ్ పన్నాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. శరీరం అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది.

పచ్చి మామిడికాయలు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పచ్చి మామిడిలోని ఆయుర్వేద గుణాలు శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తాయి. వేడి ఉష్ణోగ్రతలనుండి తక్షణమే ఉపశమనం అందిస్తుంది. మరి పచ్చి మామిడి కాయతో తయారు చేసి ఆమ్ పన్నా గురించి తెలుసుకుందాం..

ఆమ్ పన్నా తయారీకి కావలసినవి..

పచ్చి మామిడి పండ్లు - 500 గ్రాములు

చక్కెర - 1 కప్పు

నల్ల ఉప్పు - 1 స్పూన్

వేయించిన జీలకర్ర పొడి - 1 టేబుల్ స్పూన్

పుదీనా ఆకులు - కొన్ని

నీరు - 2 లీటర్లు

ఉప్పు - రుచికి

మిరియాల పొడి - 1/2 tsp

ఐస్ క్యూబ్స్ - కొన్ని

తయారీ విధానం..

పచ్చి మామిడికాయలను తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోతైన పాన్లో టెంకతో పాటు ముక్కలను వేయాలి. తగినంత పంచదార, ఉప్పు, నల్ల ఉప్పు, మిరియాలు, వేయించిన జీలకర్ర పొడి, కారం పొడితో పాటు నీరు వేసి మరిగించాలి.

మూతపెట్టి 25-30 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తరువాత స్టౌమీద నుంచి దించి పూర్తిగా చల్లార్చాలి. ముక్కల్లో నుంచి టెంక తీసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇది రెండు వారాల పాటు ఫ్రిజ్ లో నిల్వ ఉంటుంది.

తాగేముందు ఒక గ్లాసులో కొన్ని ఐస్ క్యూబ్‌లను వేసుకుని 4-6 టేబుల్ స్పూన్ల తయారు చేసి పెట్టుకున్న మామిడి సిరప్‌ను వేసి తగినంత నీరు కలపాలి. చల్లగా తాగుతుంటే చాలా రుచిగా, హాయిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది.. మరింకెందుకు ఆలస్యం ఈ రోజే ఆమ్ పన్నా తయారు చేసేయండి.

Tags

Read MoreRead Less
Next Story