Dengue Fever: డెంగ్యూ జ్వరం: ఏవి తినాలి.. ఏవి తినొద్దు..

Dengue Fever: డెంగ్యూ జ్వరం: ఏవి తినాలి.. ఏవి తినొద్దు..
డెంగ్యూ రోగిని సులువుగా జీర్ణమయ్యే మంచి ఆహారం తీసుకోమని సలహా ఇస్తారు.

డెంగ్యూ రోగిని సులువుగా జీర్ణమయ్యే మంచి ఆహారం తీసుకోమని సలహా ఇస్తారు. మీరు తీసుకునే ఆహారం డెంగ్యూ నుండి పూర్తిగా కోలుకునేందుకు దోహదపడుతుంది. మరి ఏ ఆహార పదార్ధాలు తీసుకుంటే డెంగ్యూ నుండి త్వరగా కోలుకోవచ్చనేది తెలుసుకుందాం..

వర్షాకాలంలో డెంగ్యూ జ్వరాలు అధికంగా వస్తుంటాయి. ప్రతి సంవత్సరం ప్రజలు డెంగ్యూ బారిన పడకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోమని చెబుతుంటారు. వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి నివారణ చర్యలను పాటించాలని డాక్టర్లు సూచిస్తుంటారు.

నీరు నిలిచి ఉండే చోట డెంగ్యూను వ్యాప్తి చేసే దోమలు ఎక్కువగా ఉంటాయి. మీకు డెంగ్యూ జ్వరం ఉన్నట్లు నిర్ధారణ అయితే పూర్తిగా కోలుకునేంతవరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యులు సూచించిన మందులతో పాటు తీసుకునే ఆహారం మీకు డెంగ్యూ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న వారు కొన్ని ఆహారాలను తీసుకోవడంతో పాటు, మరి కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.

1. బొప్పాయి ఆకు రసం

బొప్పాయి ఆకు రసం డెంగ్యూ జ్వర తీవ్రతను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తున్నాంది. ఇది డెంగ్యూ రోగుల ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచుతుంది.. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. బొప్పాయి ఆకుల రసాన్ని తీసి దానికి కొంత నీటిని కలిపి, రోజుకు రెండు లేదా మూడు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

2. తాజా కూరగాయల రసం

కూరగాయలలో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రెండు మూడు కూరగాయలను కలిపి రసం చేసుకుని తాగడం మంచిది. ఇది శరీరానికి కావలసిన పోషణను అందిస్తుంది ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సి కంటెంట్ పెంచడానికి జ్యూస్ రుచిని పెంచడానికి కూరగాయల రసానికి కొద్దిగా నిమ్మరసం జోడిస్తే తాగడానికి బావుంటుంది.

3. కొబ్బరి నీరు

బాడీ డీ హైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు డెంగ్యూ వచ్చినప్పుడు కొబ్బరి నీరు తాగమని సిఫార్సు చేస్తారు. రోజుకి రెండు గ్లాసుల కొబ్బరి నీళ్లు తాగవచ్చు. కొబ్బరి నీరు ఆరోగ్యకరమైన పానీయం. మీరు కోకోనట్ వాటర్ రోజూ తీసుకున్నా మంచిదే.

4. హెర్బల్ టీ

మెరుగైన ఆరోగ్యం కోసం మీరు అల్లం టీ, ఏలకుల టీ లేదా దాల్చిన చెక్క టీని ఎంచుకోవచ్చు. హెర్బల్ టీ డెంగ్యూ నుంచి కోలుకునేందుకు ఉపకరిస్తుంది. మీ మనస్సును కూడా రిఫ్రెష్ చేస్తుంది.

5. వేప ఆకులు

వేప ఆకులు ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. డెంగ్యూ రోగులకు వేప ఆకులు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయి. ఇది వైరస్ వ్యాప్తిని మరియు పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. వేప ఆకులు డెంగ్యూకి సమర్థవంతమైన సహజ నివారణ.

నివారించాల్సిన ఆహారాలు

డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు కొన్ని ఆహారాలు తీసుకోకపోవడమే మంచిది. చికిత్సలో పురోగతి కనిపించాలంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అవి నూనె పదార్ధాలతో పాటు,వేయించిన ఆహారాలు, కెఫిన్, కార్బోనేటేడ్ పానీయాలు, కారంగా ఉండే ఆహారం మరియు కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలు జ్వరం తగ్గేంతవరకు తీసుకోకపోవడమే మంచిది.

Tags

Read MoreRead Less
Next Story