Diabetes: షుగర్‌కు ఏజ్ లిమిట్ ఉంటుందట.! ఆ వయసు దాటిన వారికి రాదట.!

Diabetes (tv5news.in)

Diabetes (tv5news.in)

Diabetes: షుగర్ వ్యాధి గురించి వినడానికి కామన్‌గానే ఉన్నా.. అది మిగతా ఆరోగ్య సమస్యలతో పోలిస్తే చాలా డేంజర్.

Diabetes: షుగర్ వ్యాధి గురించి వినడానికి కామన్‌గానే ఉన్నా.. అది మిగతా ఆరోగ్య సమస్యలతో పోలిస్తే చాలా డేంజర్. ఒక్కసారి షుగర్ అటాక్ అయ్యిందంటే జీవితాంతం మన చేతులకు సంకెళ్లు వేసుకొని బ్రతకాల్సిందే. ప్రశాంతంగా నచ్చింది తిననివ్వకుండా చేస్తుంది మధుమేహం. పైగా దీని వల్ల మిగతా ఆరోగ్య సమస్యలు కూడా సులువుగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే షుగర్ రావడానికి కూడా ఏజ్ లిమిట్ ఉంటుందంటున్నారు వైద్యులు.

వయసుతో సంబంధం లేకుండా వచ్చే ఆరోగ్య సమస్యల్లో షుగర్ కూడా ఒకటి. అయితే ఈ షుగర్‌కు ఏజ్ లిమిట్ ఉంటుందట. ఒకవేళ మధుమేహం రావాలంటే 45 ఏళ్లలోపే వస్తుందని.. లేకపోతే ఇక 60 తర్వాతే అని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామంది టీనేజర్లు, యూత్ షుగర్‌కు బాధితులయ్యారు. వారిలోనే క్రమక్రమంగా షుగర్ లెవెల్స్ పెరుగుతూ వస్తున్నాయి. ఇక షుగర్ బారినపడిన మధ్య వయస్కులు కూడా చాలామందే ఉన్నారు.

ఒక సర్వే ప్రకారం.. వేయి మంది షుగర్ పరీక్షలు చేయించుకుంటే 30 నుంచి 40 ఏళ్ల మధ్య వారు 500 మంది ఉంటున్నారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వారు 100 మంది.. 60 ఏళ్లు దాటిన వారు 400 మంది ఉంటున్నారట. ఈ సర్వే నిజమేనని చాలామంది వైద్యులు ధృవీకరించారు కూడా. ప్రపంచంలో షుగర్ బాధితులు ఎక్కువ ఉన్నవారిలో ఇండియానే ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. సౌత్ ఇండియాలోనే వీరు ఎక్కువశాతం కనిపిస్తుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అన్నం తినడం అలవాటు అయిపోవడమే దీనికి కారణమని అంచనా వేస్తున్నారు వైద్యలు.

గత 20 సంవత్సరాలుగా దేశంలో షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. షుగర్ పేషెంట్లను దగ్గర నుండి చూసినవారు, వారి కష్టాలను అర్థం చేసుకున్న వారు.. ఆ షుగర్ వ్యాధి తమవరకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే ప్రస్తుతం ఇంటికి కేవలం ఒక్క షుగర్ పేషెంట్ మాత్రమే కనిపిస్తున్నారు. షుగర్ రాకుండా ఉండడం ఎలా అని ఆరాతీసి పలు రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వంశంలో ఎవరైనా షుగర్ బారిన పడితే మిగతా కుటుంబ సభ్యులు అది వారికి ఎలా రాకుండా ఉంటుందో తెలుసుకుని జాగ్రత్తపడుతున్నారు. కనీసం 60 ఏళ్ల వరకు దాని బారినపడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలు ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో షుగర్ బాధితుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అని వారు సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story