Diabetes: డయాబెటీస్ వల్ల ఈ శృంగార సమస్యలు... తెలుసుకోండి..!

Diabetes: డయాబెటీస్ వల్ల ఈ శృంగార సమస్యలు... తెలుసుకోండి..!
Diabetes: డయాబెటీస్ అనేది ప్రస్తుతం వందమందిలో ఒకరికి వస్తున్న సమస్య. అందుకే దాన్ని కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు.

Diabetes: డయాబెటీస్ అనేది ప్రస్తుతం వందమందిలో ఒకరికి వస్తున్న సమస్య. అందుకే దాన్ని కొంతమంది నిర్లక్ష్యం చేసినా, మరికొందరు మాత్రం ఈ డయాబెటీస్(Diabetes) అనేది ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయకూడదని భావిస్తున్నారు. అందుకే షుగర్ లెవెల్స్‌ను ఎప్పుడో కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మామూలుగా డయాబెటీస్ పేషెంట్లకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయో మనకు తెలుసు.. కానీ దీని వల్ల వారి వైవాహిక జీవితం కూడా సమస్యల్లో పడే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆ సమస్యలకు దూరంగా ఉండవచ్చని వెల్లడించారు.

డయాబెటీస్ వల్ల శృంగార జీవితానికి సమస్య కలుగుతుందని చాలా తక్కువమందికి తెలుసు. షూగర్ లెవెల్స్(sugar levels) పెరిగితే నరాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఫలితంగా అంగస్తంభన లేకపోవడం, శీఘ్రస్కలనం లాంటి సమస్యలు వస్తాయి. డయాబెటీస్ సంతానంపైన కూడా ప్రభావం చూపిస్తుంది. మగవారిలో వీర్యకణాల సంఖ్య తక్కువ కావడం, ఉన్నవి కూడా బలహీనపడటం వల్ల సంతానం కష్టమవుతుంది.

ఇక మహిళల్లో అధిక చక్కెర, దాంతోపాటు వచ్చే ఇన్ఫెక్షన్ల వల్ల ఫాలోపియన్‌ ట్యూబుల్లో అడ్డంకులు ఏర్పడటం, రుతుక్రమం సరిగా లేకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ గర్భం దాల్చినా అది నిలవలేని ప్రమాదం ఉంటుంది. షూగర్ లెవెల్స్‌పైనే మూడ్ స్వింగ్స్ కూడా ఆధారపడతాయి. మామూలుగా స్ట్రెస్ వల్ల, ఇతర కారణాల వల్ల మూడ్ స్వింగ్స్ సహజం. కానీ షూగర్ కూడా మన భావోద్వేగాల పైన ప్రభావం చూపిస్తుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో స్పందన కాస్త అసహజంగా ఉంటే షుగర్ లెవెల్స్‌పై కాస్త దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story