Selfie Addiction: సెల్ఫీ దిగే ముందు పాటించాల్సిన ఏడు సూత్రాలు..

Selfie Addiction: సెల్ఫీ దిగే ముందు పాటించాల్సిన ఏడు సూత్రాలు..
Selfie Addiction: మనుషులు మునుపటికంటే ఎక్కువ సౌఖర్యవంతంగా జీవించడానికి టెక్నాలజీని ఎప్పటికప్పడు పెంచుకుంటూ పోతున్నాం.

Selfie Addiction: మనుషులు మునుపటికంటే ఎక్కువ సౌఖర్యవంతంగా జీవించడానికి టెక్నాలజీని ఎప్పటికప్పడు పెంచుకుంటూ పోతున్నాం. కానీ చాలామంది దానిని మంచికంటే ఎక్కువగా చెడుకే ఉపయోగిస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు టెక్నాలజీ వల్ల లాభం కంటే ఎక్కువగా నష్టమే పొందుతున్నారు. ఏది, ఎందుకు , ఎలా ఉపయోగించాలి తెలియక కూడా టెక్నాలజీ వల్ల మనుషులు చిక్కుల్లో పడుతున్నారు. అలాంటి వాటిలో ఒకటే సెల్ఫీ అడిక్షన్.


సెల్ఫీ కెమెరా వచ్చిన కొత్తలో దీనిని ఉపయోగించడానికి అందరూ ఉత్సాహపడ్డారు. అదే క్రమంలో ఢిఫరెంట్ సెల్ఫీలను ప్రయత్నిస్తూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. తాము ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తు్న్నాం అనే విషయాలను మర్చిపోయేలా సెల్ఫీ అడిక్షన్ కొంతమందిని కమ్మేసింది. ఈ ఏడాది ఇప్పటికి సెల్ఫీ అడిక్షన్ వల్ల రాష్ట్రంలో 8 మంది మరణించారు. ప్రమాదకరమైన చోట్లలో వెళ్లి సెల్ఫీ తీసుకోవాలి అనుకోవడమే దీనికి ముఖ్య కారణం. అయితే ఈ అడిక్షన్‌ను కంట్రోల్ చేయాలనుకోకపోతే ఇది మానసిక సమస్యగా మారుతుందంటున్నారు నిపుణులు.


సోషల్ మీడియాలో లైక్‌ల కోసం ఆరాటమే మరింత సెల్ఫీ అడిక్షన్‌కు దారితీస్తుంది. అందుకే ఈ అడిక్షన్‌ను అరికట్టాలంటే సెల్ఫీ తీసుకునే ముందు మనకు మనమే ఏడు ప్రశ్నలు వేసుకోవాలట. ఈ ఏడు ప్రశ్నలకు సమాధానం సరైనదే అనిపిస్తే అప్పుడు సెల్ఫీ తీసుకోవడం కరెక్ట్ అంటున్నారు వైద్యులు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..

1. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రాంతాల్లో అసలు ఫొటోగ్రఫీకి అనుమతి ఉందా?

2. సెల్ఫీ కారణంగా నాకు, నా చుట్టు పక్కల వాళ్లకు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందా?

3. సెల్ఫీ తీసుకుంటూ ఎదుటివారు చూస్తున్న వాటికి నేను అడ్డం వస్తున్నానా? ట్రాఫిక్‌ ఇబ్బందులు కలిగిస్తున్నానా?

4. సెల్ఫీ తీసుకునే ప్రయత్నాల్లో మరో వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బతీస్తున్నామా?

5. సెల్ఫీ తీసుకుంటున్న ప్రాంతంలో కంటికి కనిపించని ముప్పు పొంచి ఉందా?

6. సెల్ఫీ తీసుకోవడం సమంజసమేనా?

7. నేను తీసుకుంటున్న సెల్ఫీ ఇతరులకు అభ్యంతరకరం అవుతుందా?

సెల్ఫీ అడిక్షన్‌కు చెక్ పెడుతూ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. అందుకే కొన్నిచోట్ల నో సెల్ఫీ జోన్‌లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ముంబాయిలో 29, గోవాలో 23 నో సెల్ఫీ జోన్‌లు ఏర్పాటయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story