Health Tip: గుండె మంటకు ఈ ఆహార పదార్థాలు ప్రమాదకరం..

Health Tip: గుండె మంటకు ఈ ఆహార పదార్థాలు ప్రమాదకరం..
Health Tip: గుండె అనేది మనిషిన నడిపించే పరికరం లాంటిదే. అది ఒక్కటి ఆగితే చాలు.. మనిషి జీవనం ఆగిపోవడానికి.

Health Tip: గుండె అనేది మనిషిన నడిపించే పరికరం లాంటిదే. అది ఒక్కటి ఆగితే చాలు.. మనిషి జీవనం ఆగిపోవడానికి. అలాంటి గుండెను అందరం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇటీవల కాలంలో పిల్లలు నుండి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అలాంటి వ్యాధులు మితిమీరడంకంటే ముందే వాటిని మన ఆహార అలవాట్లతో అరకట్టవచ్చు అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా కొన్ని కూరగాయలను గుండె నొప్పితో బాధపడుతున్నవారు అస్సలు తీసుకోవద్దట. కష్టంగా జీర్ణమయ్యేవి ఏవైనా గుండెకు మంచిది కాదంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..

వేపుళ్లు అనేవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఇప్పటికీ మనం ఎన్నోసార్లు వినుంటాం. ఎందుకంటే నూనెలో వేయించిన ఆహారాలు కష్టంగా జీర్ణం అవుతాయి. ముఖ్యంగా బయట నూనెలో వేయించిన పధార్ధాలు తినడం గుండెకు అసలు మంచిది కాదు. వీటితో పాటు మసాలా ఆహారాలకు కూడా దూరంగా ఉంటే మంచిది. నాలికకు మంటను కలిగించే ఏ ఆహారమయినా మీ ఆహార గొట్టాన్ని మండించి గుండెమంట కలిగిస్తాయి.

పాలలోని లాక్టోజ్‌ అనే షుగర్. చాలామందిలో లాక్టోస్‌ జీర్ణం చేయగల ఎంజైములు లేకపోవటం వల్ల గుండెమంట సమస్య వస్తుంది. పప్పులు, రాజ్మా, బీన్స్, గింజలు వంటివి పొట్టకు బరువే. వీటిలో కూడా ఆలిగో శాచురేట్స్‌ అనే పదార్థం ఉంటుంది. సిట్రస్‌ పండ్ల రసాలు కూడా అజీర్ణం కలిగిస్తాయి. ఆహార గొట్టం కణాలను ఇబ్బంది పెట్టే వాటిలో ఇవి కూడా ఒకటి. వీటిని ఖాళీ పొట్టతో తీసుకుంటే అది మరింత ప్రమాదకరం. రాగి, రాగి రొట్టెలలో కాల్షియం, ఐరన్‌ ఎక్కువగా ఉండడం వల్ల కడుపులో బరువుగా అనిపిస్తుంది. ఈ ఆహారాలు కష్టంగా జీర్ణం అవుతాయి. అందుకే వీటిని తక్కువ మొత్తంలో తీసుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story