High BP: ఈ లక్షణాలు ఉంటే.. హైబీపీ ఉన్నట్టే! ఓసారి చెక్ చేసుకోండి

High BP (tv5news.in)

High BP (tv5news.in)

High BP: ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.

High BP: ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. చిన్న వయసు నుండే షుగర్, బీపీలాంటి సమస్యలను ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా ఈరోజుల్లో అందరినీ ఎక్కువగా చుట్టుముడుతున్న సమస్య హై బీపీ. హై బీపీకి కారణాలు ఇవే అని ప్రత్యేకంగా చెప్పలేం. దానికి అనేక కారణాల ఉండవచ్చు. కానీ హై బీపీ ఉన్నవారికి బ్లడ్ ఫ్లోటింగ్ తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంటుంది. అయితే ఒకరికి హై బీపీ ఉందా లేదా తెలుసుకోవడానికి కూడా పరీక్షలు ఉంటాయి అంటున్నారు వైద్య నిపుణులు.

రక్తపోటు 140/90 ఎంఎం లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే హై బీపీగా పరిగణిస్తారు. దీనిని పట్టించుకోకుండా వదిలేస్తే గుండె జ‌బ్బులు, స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు అధికం. ఆరోగ్య అలవాట్ల వల్ల చాలామంది హై బీపీ బారినపడుతుంటే.. అవేవీ లేకపోయినా కూడా కొంతమంది ఈ సమస్యను ఎదుర్కుంటున్నారు. 20 ఏళ్లు దాటిన తర్వాత వంశపారంపర్యంగా హైపర్‌టెన్షన్‌ వచ్చే అవకాశముంది. ఇదే బీపీకి కూడా దారితీస్తుంది.

ప్రస్తుతం 20-30 ఏండ్ల వయస్సు వారిలో 5 శాతం, 30-40 ఏండ్ల వారిలో 10 శాతం, 40-50 ఏండ్ల వయస్సు వారిలో 5 శాతం, 50-60 ఏండ్ల వారిలో 15 శాతం మంది హైపర్‌టెన్షన్‌ బారిన పడుతున్నారు. స్ట్రీట్ ఫుడ్‌కు అలవాటు పడడం కూడా బీపీపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫ్రిజ్‌లో నిల్వ ఉన్న ఆహారం వల్ల కూడా బీపీ కనెక్ట్ అయ్యింటుంది. ఇక ట్రాఫిక్‌లో ఎక్కువగా తిరిగేవారికి చాలా సులువుగా హై బీపీ వచ్చేస్తుందట.

ఈ లక్షణాలతో హై బీపీని కనిపెట్టేయొచ్చు..

మామూలుగా హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఛాతిలో మంట కలుగుతూ ఉంటుంది. అలా లేకుండానే ఛాతిలో మంటగా ఉంటుందంటే హై బీపీ అని అనుమానించవచ్చు.

హైబీపీ ఉన్నవారికి క‌డుపులో వికారంగా అనిపిస్తుంది. మూత్రం త‌క్కువ‌గా వ‌స్తుంది. అప్పుడప్పుడు శరీరంలోని పలు భాగాలు మొద్దుబారిన‌ట్లు అనిపిస్తుంది.

హై బీపీ వల్ల ముక్కులో నుండి రక్తం రావడం, తలనొప్పి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి.

మూర్ఛ రావడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం కూడా హై బీపీ లక్షణాలే.

కంగారు, ఆందోళ‌న‌, అల‌స‌ట‌, నిద్రలేమి స‌మ‌స్యలు ఉంటే హైబీపీగా అనుమానించాలి.

హై బీపీ వల్ల ముఖమంతా ఉబ్బుతుంది. అంతే కాకుండా ముఖం ఎర్రగా కూడా మారుతుంది.

హై బీపీ వల్ల కళ్లు సరిగ్గా కనిపించవు. అంతా మసకగా అయిపోతుంది.

సరిపడా నిద్రపోయినా తర్వాత కూడా ఇంకా మత్తుగా ఉంటే అది హై బీపీ అని అనుమానించవచ్చు.

హై బీపీకి ఇలా చేస్తే మంచిది..

రెడ్‌ మీట్‌, మీగడ, వెన్న, నూనె ఆహారాలకు దూరంగా ఉండాలి.

శరీరం డీహైడ్రేట్‌ కాకుండా కొబ్బరినీరు తాగాలి.

వంటల్లో తప్పనిసరిగా వెల్లుల్లి ఉండేలా చూడాలి.

నిత్యం తప్పనిసరిగా 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.

నిమ్మరసం నిత్యం తీసుకోవాలి.

అప్పుడప్పుడు ఉల్లిపాయ రసం సేవించాలి.

ఎక్కువ సేపు కుర్చీకి అత్తుకుని కూర్చోకుండా చూసుకోవాలి.

సిగరెట్‌, మద్యం సేవించే అలవాటును మానుకోవాలి.

ఆహారంలో ఎక్కువ కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.

నిత్యం ఒక అరటిపండు అయినా తినాలి.

Tags

Read MoreRead Less
Next Story