Omicron: ఒమిక్రాన్ బారినపడిన వారు.. వారం రోజులు అయినా..

Omicron: ఒమిక్రాన్ బారినపడిన వారు.. వారం రోజులు అయినా..
Omicron: శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్‌కి గురైనవారు ఒకశాతం కంటే తక్కువ మందే ఉన్నారు.

Omicron: ఎవరింట్లో చూసినా ఎవరో ఒకరు దగ్గుతూనో, తుమ్ముతూనో కనిపిస్తున్నారు.. అయితే ఈ లక్షణాలతో ఆస్పత్రికి వస్తున్నవారి సంఖ్య చాలా తగ్గింది అని చెబుతున్నారు డాక్టర్లు.. టెస్ట్ చేయించుకుంటే కరోనా లేదా ఒమిక్రాన్ అని చెబుతారేమో అని కామ్‌గా హోమ్ ఐసోలేషన్‌లో ఉండి ఫ్యామిలీ డాక్టర్ సూచించిన మందులు వాడుతూ రెస్ట్ తీసుకుంటున్నారు.

వారం రోజుల తరువాత తిరిగి విధుల్లో జాయిన్ అవుతున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది అని వైద్యులు వివరిస్తున్నారు. అయితే జలుబు, దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి వంటి లక్షణాలు తీవ్రంగా ఉంటే మాత్రం అశ్రద్ధ చేయొద్దని డాక్టర్లు అంటున్నారు. అత్యధిక సందర్భాల్లో గొంతు వరకే పరిమితమైన ఒమిక్రాన్ ఊపిరితిత్తుల్లోకి చేరే అవకాశాలు అరుదుగా సంభవిస్తున్నాయని పేర్కొంటున్నారు.

భయపెట్టిన రెండోదశ..

కోవిడ్ రెండో దశ డెల్టా వేరియంట్ విజృంభించినప్పుడు అధికుల్లో శ్వాసకోశాలపై దుష్ప్రభావం పడింది. ఆ పరిస్థితి ఒమిక్రాన్ బాధితుల్లో లేదు. శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్‌కి గురైనవారు ఒకశాతం కంటే తక్కువ మందే ఉన్నారు. ఆస్పత్రిలో చేరే వారు కూడా తక్కువ శాతం అని వైద్యులు తెలిపారు.

ఒమిక్రాన్ లక్షణాల్లో ప్రాధమికంగా గుర్తించాల్సినవి.. గొంతులో ఇబ్బంది, దురద, తలనొప్పి, జ్వరం, దగ్గు, జలుబు.. కొందరు చలి జ్వరంతోనూ ఇబ్బంది పడుతున్నారు. పిల్లల్లో అయితే కొందరికి వాంతులు అవుతున్నాయి. కళ్లు ఎర్రబడుతున్నాయి. కొందరిలో వ్యాధి తగ్గిన 2, 3 వారాలకి కూడా దగ్గు తగ్గడం లేదు. సైనస్ ఉన్న వారికి ఇది మరింత ఇబ్బంది పెడుతుంది.

మందులు వాడుతున్నా తగ్గకపోతే ప్రత్యామ్నాయాలు ప్రయత్నించాలని అంటున్నారు శ్వాసకోశ సంబంధిత నిపుణులు. ఇప్పుడొస్తున్న ఇన్ఫెక్షన్ కేసుల్లో 95 శాతం ఒమిక్రాన్‌కు సంబంధించినవే అయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. దీని వల్ల ముప్పు లేదు.. అలా అని అశ్రద్ధ పనికి రాదు.. లక్షణాలు తీవ్రంగా ఉంటే వైద్యుల సూచనమేరకు డీడైమర్, సీఆర్‌పీ వంటి పరీక్షలు చేయించుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story