Human Life Span: మానవ ఆయుష్షు 150 సంవత్సరాలు.. అంత కాలం ఆరోగ్యంగా..

Human Life Span: మానవ ఆయుష్షు 150 సంవత్సరాలు.. అంత కాలం ఆరోగ్యంగా..
ఆ తరువాత, మానవ శరీరం తనను తాను రిపేర్ చేసుకోలేదు. మానవులు 120 మరియు 150 సంవత్సరాల మధ్య జీవించగలుగుతారు అని ఒక కొత్త అధ్యయనం సూచిస్తుంది.

Human Life Span: ఆ తరువాత, మానవ శరీరం తనను తాను రిపేర్ చేసుకోలేదు. మానవులు 120 మరియు 150 సంవత్సరాల మధ్య జీవించగలుగుతారు అని ఒక కొత్త అధ్యయనం సూచిస్తుంది.

నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం 120 నుండి 150 సంవత్సరాల వయస్సు తరువాత, మానవ శరీరం అనారోగ్యం మరియు గాయం వంటి ఒత్తిళ్ల నుండి కోలుకునే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోతుందని, ఫలితంగా మరణం సంభవిస్తుందని అంచనా వేశారు.

ఈ రోజుల్లో 30 ఏళ్లకే కాళ్లు నొప్పులు, 40 ఏళ్లకి నడుం నొప్పులు.. ఒకటేమిటి ఒక్కొక్కటిగా అనారోగ్యాలు చుట్టుముడుతుంటాయి 50 ఏళ్లు వచ్చేసరికి. అడపా దడపా ఆస్పత్రికి వెళ్లందే రోజులు గడపలేని పరిస్థితులు. 50 ఏళ్లు వచ్చే సరికి సగం జీవితం గడిచిపోయిందన్న ఫీలింగ్. జపాన్, బ్రిటన్ దేశాల్లో అయితే శతాధిక వృద్ధులు చాలా ఎక్కువగా ఉంటారు. దేశ కాల పరిస్థితులను బట్టి ప్రజల సగటు ఆయుష్షు మారిపోతుంటుంది. ఫ్రెంచి మహిళ 122 సంవత్సరాలు బతికి ప్రపంచంలోనే ఎక్కువ కాలం బ్రతికిన మహిళగా రికార్డులకెక్కింది.

1875లో ఆమె జీవించినప్పుడు మనిషి సగటు జీవితకాలం 43 ఏళ్లు. అత్యాధునిక వైద్య సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత మనిషి జీవిత కాలం పెరిగింది అని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇంతకు ముందు మనిషి గరిష్టంగా 140 సంవత్సరాలు బ్రతుకుతారని చెప్పే వారు. ఇప్పుడు 150 సంవత్సరాలు బతికే అవకాశముందని రష్యా, అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం తన ధర్మాన్ని నిర్వర్తించే సామర్థ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఒక్కో అవయవం పనిచేయడం మానేస్తున్నప్పుడు శరీరం సమస్థితిని కోల్పోతుంది. చివరికి మరణం సంభవిస్తుంది. ఒకవేళ వ్యాధుల నుంచి కోలుకునే సామర్ధ్యం తగ్గకుండా చూసుకుంటే మనిషి 150 ఏళ్లు జీవించే అవకాశం ఉంది అని పరిశోధకులు పేర్కొంటున్నారు.

కాకిలా కలకాలం జీవించే కంటే హంసలా ఆరు నెలలు జీవించినా చాలు అని పెద్దవాళ్లు సామెతగా చెబుతుంటారు. మరి బ్రతికినంత కాలఆరోగ్యంగా జీవించాలంటే ఆహారము, వ్యాయామముతో పాటు సరైన జీవన ప్రణాళికను అలవరచుకోవాలి. ఇవి జీవితకాలాన్ని మరింత పెంచుతుంది అని యూనివర్శిటీ ఆఫ్ బ్రైటెన్‌కు చెందిన పరిశోధన కర్త రిచర్డ్ ఫరాఘెర్ వివరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story