పిల్లలలో ఇమ్యూనిటీ పెరగడం కోసం ఈ ఆహారం ఇవ్వండి..!

పిల్లలలో ఇమ్యూనిటీ పెరగడం కోసం ఈ ఆహారం ఇవ్వండి..!
Immune Foods for Kids: ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలపై విరుచుకుపడుతుందన్న నిపుణుల అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తుంది.

Immune Foods for Kids: ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలపై విరుచుకుపడుతుందన్న నిపుణుల అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తుంది. ఇప్పటికే దేశంలో అనేక ప్రాంతాలలో పిల్లలు కరోనా వైరస్ భారిన పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. దీంతో పిల్లల తల్లిదండ్రులు కంగారుపడుతున్నారు. అంతేకాకుండా కాలం మారుతున్నట్టుగా మనుషలపై కొన్ని రోగకారక వైరస్లు దాడిచేస్తుంటాయి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలపై వీటి ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి పిల్లల్ని అన్ని రకాల వైరస్ ల నుండి కాపాడుకోవాలంటే వారికి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని అందివ్వాలి.

ముఖ్యంగా డ్రైఫ్రూట్స్‌ లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ లాంటివి అధిక మోతాదులో ఉండటంతో ఇవి పిల్లలలో ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి. బాదం పప్పు, జీడిపప్పు, అంజీర వంట వాటిని పిల్లలకు ఆహరంలో బాగం చేయండి. సాధారణంగా చాలామంది పిల్లలు డ్రైఫ్రూట్స్‌ తినేందుకు అంతగా ఇష్టపడరు. ఇలాంటి వారికి డ్రైఫ్రూట్స్‌ తో సలాడ్స్ చేసి ఇవ్వొచ్చు. లేదంటే డ్రైఫ్రూట్స్‌ ను పొడిగా చేసి పాలల్లో, ఇతర వంటకాలలో మిక్స్ చేసి కూడా అందించవచ్చు.

కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లబిస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా చూస్తాయి. దీంతో వ్యాధులు రాకుండా కాపాడటమేగాక శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. పాలకూర, తోటకూర, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, క్యారెట్స్ తదితర కూరగాయలను ఎక్కువగా పిల్లలకు ఇవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.

శరీరానికి కావాలసిన ఇమ్యూనిటీ పెంచే విషయంలో పండ్లను ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి. పిల్లలకు యాపిల్, నారింజ, జామ పండ్లు ఇస్తే మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవే కాకుండా కాలానుగుణంగా లభించే పండ్లను కూడా పిల్లలకు అందివ్వటం చాలా మంచిది.

ప్రోటీన్లు పుష్కలంగా లభించే వాటిలో పప్పు దినుసులు ముఖ్యమైనవి. ఇవి శరీర కణజాలాన్ని బలపరుస్తాయి. ఈ క్రమంలో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే పిల్లలకు నిత్యం పప్పు దినుసులు పెడితే మంచిది. కోడిగుడ్లు, పుట్టగొడుగులు, బెల్లం, రాగులు, నువ్వులు, పెరుగును పిల్లల ఆహారంలో ఉండేలా తల్లిదండ్రులు చూసుకుంటే వివిధ అనారోగ్యాల బారి నుండి వారిని రక్షించుకోవచ్చు.


Tags

Read MoreRead Less
Next Story