Japanese Kids : ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యవంతులు.. జపనీస్ చిన్నారుల హెల్త్ సీక్రెట్

Japanese Kids : ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యవంతులు.. జపనీస్ చిన్నారుల హెల్త్ సీక్రెట్
Japanese Kids : పోషకాలతో నిండి ఉన్న ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటి మంచి ఆరోగ్య లక్షణాలు వారికి చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తారు పెద్దవాళ్లు.

Japanese Kids: అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా ఉండాలి.. ఒక అధ్యయనం ప్రకారం జపాన్‌లో జన్మించిన చిన్నారులు ప్రపంచంలోనే అత్యధిక ఆయుర్దాయం కలిగిన వారుగా ప్రసిద్ధికెక్కారు.

అధ్యయనం ప్రకారం, జపనీస్ అమ్మాయిలు, అబ్బాయిలు ఎటువంటి అనారోగ్యం లేదా అంగవైకల్యం లేకుండా 73 సంవత్సరాల వయస్సు వరకు జీవిస్తుంటారు. అక్కడివారి సగటు ఆయుర్దాయం 80 సంవత్సరాలు.


పోషకాలతో నిండి ఉన్న ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటి మంచి ఆరోగ్య లక్షణాలు వారికి చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తారు పెద్దవాళ్లు.

కుటుంబ సమేతంగా ఇంట్లో పోషకాలతో కూడిన రుచికరమైన ఆహారాన్ని తయారు చేస్తారు. జపనీస్ సంస్కృతిలో, తల్లిదండ్రులు తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆదర్శంగా తీసుకుంటారు పిల్లలు.


ప్రతి వారం ఓ కొత్త వంటకాన్ని ట్రై చేస్తారు. దాంతో పిల్లలకు కూడా దాని పట్ల ఆసక్తిగా ఉంటుంది. ఇష్టంగా తింటారు. కొత్త వంటకం గురించి నెట్లో సోధిస్తూ అందులో పిల్లల్ని కూడా భాగస్వాములను చేస్తారు పెద్దవాళ్లు. ఈ వారం ఇది ట్రై చేద్దామా అని వారినే అడిగి వండుతారు.

గత 20 ఏళ్లలో జపనీస్ సగటు భోజన పరిమాణం కూడా మారింది. వారు చిన్న ప్లేట్లలో భోజనం చేస్తారు. దాంతో ఎక్కువ తిన్న భావన కలుగుతుంది. ప్లేట్ పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు తక్కువ మొత్తంలో వడ్డించుకోడానికి ఆస్కారం ఉంటుంది.

పోషకాహారం ఎక్కువ, కేలరీలు తక్కువ ఉన్న ఆహారం తీసుకుంటారు. ఉదాహరణకు ఒక చిన్న గిన్నె అన్నం, ఒక గిన్నె సూప్ మూడు సైడ్ డిష్‌లు వీరి ఆహారంలో ఉంటాయి. ఇవి సాధారణంగా చేపలు, మాంసం లేదా రెండు కూరగాయలు.


సహజంగా ఉత్పత్తులను, మొక్కల ఆధారిత ఆహారాలను ఎంచుకోవడం వలన ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు. జపనీస్ డైనింగ్ టేబుల్ మీద ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, డీప్ ఫ్రైడ్ ఫుడ్‌లు, ఫ్యాట్ ఫుడ్ లు ఉండవు.

మనకి మాదిరిగానే అక్కడ కూడా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పధకం ఉంది. ఇక్కడ స్కూల్స్ లో చిన్నప్పటి నుండి పిల్లలందరికీ స్థానికంగా పండించిన ఆహార పదార్థాలతో తయారు చేయబడిన భోజనం వడ్డిస్తారు.

పిల్లలు కూడా లంచ్‌ ప్లాన్ చేయడం, సిద్ధం చేయడం, సర్వ్ చేయడంలో సెద్దవారికి సహాయం చేస్తారు. ఇంకా పిల్లలు పోషకాహారం యొక్క లాభాలను అధ్యయనం చేస్తారు. స్థానిక వ్యవసాయ క్షేత్రాలను సందర్శిస్తారు, వంట చేసే విధానం ఎలాగో పెద్దలను అడిగి తెలుసుకుంటారు. టేబుల్ మర్యాదలను నేర్చుకుంటారు.




జపాన్‌లో, శారీరక శ్రమ అనేది చాలా చిన్న వయస్సు నుండే పిల్లల జీవితాల్లో భాగమవుతుంది. 98.3 శాతం మంది పిల్లలు పాఠశాలకు నడిచి వెళతారు. ప్రతి రోజూ కచ్చితంగా 60 నిమిషాలు శారీరక శ్రమ ఉండేలా చూసుకుంటారు. అందుకే అంత ఆరోగ్యంగా ఉంటారు.

Tags

Read MoreRead Less
Next Story