ఇంట్లోనూ ఇకపై మాస్క్.. గాలి ద్వారా వేగంగా వైరస్

ఇంట్లోనూ ఇకపై మాస్క్.. గాలి ద్వారా వేగంగా వైరస్
గాలి ద్వారా కూడా వేగంగా వ్యాప్తిస్తోందని తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు హెచ్చరిస్తున్నారు

ఇంట్లోనూ ఇకపై మాస్క్ పెట్టుకోవాల్సిందే. కరోనా వైరస్‌.. ముక్కు, నోరు, కళ్ల ద్వారా మాత్రమే మరొకరికి సోకుతుందనుకున్నాం. అయితే, గాలి ద్వారా కూడా వేగంగా వ్యాప్తిస్తోందని తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ గాలిలో అతి తక్కువ సమయం మాత్రమే ఉంటుంది.

గాలి ద్వారా కరోనా వైరస్ సోకడం చాలా అరుదు. కాని, ఇప్పుడదే గాలి ద్వారా వైరస్‌ వేగంగా విస్తరింస్తోందంటున్నారు. అందుకే, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్ పెట్టుకుని తిరగడం మంచిదని సూచిస్తున్నారు.

తెలంగాణలో కరోనా చాలా వేగంగా విస్తరిస్తోందని చెప్పారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించకుండా అజాగ్రత్తగా ఉంటే.. మున్ముందు ఆస్పత్రిలో బెడ్లు కూడా దొరకని పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.

మాస్కులు, భౌతికదూరం, శానిటైర్లు ఉపయోగించకపోతే మహారాష్ట్రలో రోజుకు 60వేల కేసులు నమోదైనట్టు తెలంగాణలోనూ పరిస్థితులు వస్తాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుత గడ్డుకాలం మరో ఆరు వారాల పాటు ఉంటుందని, వచ్చే నెలాఖరు వరకు అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story