మందు తాగుతూ మంచింగ్ లోకి ఈ పదార్థాలు తినకూడదు..!

మందు తాగుతూ మంచింగ్ లోకి ఈ పదార్థాలు తినకూడదు..!
Drinking Alcohol: ప్రస్తుత కాలంలో మద్యం సేవించడం చాలా కామన్ అయిపోయింది.

Drinking Alcohol: ప్రస్తుత కాలంలో మద్యం సేవించడం చాలా కామన్ అయిపోయింది. ఆడా, మగా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మద్యం సేవిస్తున్నారు. కొందరు మంచి బ్రాండ్ లు తాగుతుంటే మరికొందరేమో తమ బడ్జెట్ కు తగ్గట్టు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదంతా బానే ఉంది కానీ మద్యం సేవించే టప్పుడు తీస్కునే ఆహారంపై దృష్టి పెట్టడం లేదు. మద్యం సేవించడం వాళ్ళ అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మందు తాగేటప్పుడు మంచి ఆహారం తేస్కోకపోవడం వాళ్ళ కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయట. అయితే మద్యం సేవించేటప్పుడు టప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏ రూల్స్ పాటించాలో ఇప్పుడు చూద్దాం.

మద్యం సేవించే సమయంలో కొంతమంది చాక్లెట్ తీసుకుంటారు. అయితే చాక్లేట్ తీసుకోవడం ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు. చాక్లెట్లు తీసుకోవడం వల్ల కడుపులో మంట సమస్య పెరిగి.. గ్యాస్ సమస్య దారి తీస్తుంది.

బీన్స్ మరియు కాయధాన్యాలు వంటి వాటిని కూడా మద్యం సేవించే సమయంలో ముట్టుకోవద్దు అని చెబుతున్నారు. మద్యం సేవించి వీటిని తీసుకుంటే మన శరీరంలో అలజడి, గుండె దడ, మరియు కన్ఫ్యూషన్ వాటివి నెలకొంటాయని వైద్యులు చెబుతున్నారు.

వైన్ తాగేటప్పుడు చాలా మంది ఫ్రైడ్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే ఈ ఫ్రైడ్ ఫుడ్ తినడం వల్ల... మన శరీరంలో శక్తి పూర్తిగా తగ్గిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మద్యం సేవించేటప్పుడు బ్రెడ్ ముక్కలు తీసుకుంటే చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. ఈ బ్రెడ్ ముక్కలు తినటం వల్ల మన శరీరంలో నీటి స్థాయి తగ్గిపోయి బాడీలో డీహైడ్రేట్ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మద్యం సేవించిన అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ కాఫీ తాగకూడదని చెబుతున్నారు వైద్యులు. ఇలా మద్యం సేవించిన వెంటనే కాఫీ తాగితే హ్యాంగోవర్ సమస్యతో పాటు వాంతులు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story