Bloating: కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే ఇంట్లోనే ఈ విధంగా..

Bloating: కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే ఇంట్లోనే ఈ విధంగా..
Bloating: జీవనశైలిని మార్చుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం సమస్యలను తగ్గించుకోవచ్చు.

Bloating: కొన్ని ఆహార పదార్ధాలు పడవని తెలిసినా తింటారు.. కొందరికి ఏమీ తినకపోయినా గ్యాస్ వస్తుంది.. జీవనశైలిని మార్చుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం సమస్యలను తగ్గించుకోవచ్చు.

కడుపు ఉబ్బరం అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది సాధారణంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ (GI)లో గ్యాస్ ఏర్పడటం వలన సంభవిస్తుంది. ఇది అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. అత్యంత సాధారణమైనది తినే ఆహారం. కొన్ని సింపుల్ హోం రెమెడీస్‌ని అనుసరించడం ద్వారా ఉబ్బరం నుండి సులభంగా బయటపడవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

01. పొత్తికడుపుకు మసాజ్


పొత్తికడుపును సున్నితంగా మసాజ్ చేయడం వల్ల గ్యాస్‌ను శరీరం నుండి సులభంగా బయటకు పంపవచ్చు. త్వరగా ఉపశమనం పొందడానికి మసాజ్ నిర్దిష్ట పద్ధతిలో చేయాలి. కుడి తుంటి ఎముక పైన చేతులను ఉంచి, పక్కటెముక వైపు చేతులతో వృత్తాకారంలో రుద్దాలి. అయిదు నుంచి పది నిమిషాలు ఇలా చేయాలి.

02. గోరు వెచ్చని నీటితో స్నానం


వెచ్చని స్నానం కూడా ఉబ్బరం నుండి బయటపడటానికి సమర్థవంతమైన పరిష్కారం. వేడినీటి స్నానం కడుపు నొప్పికి ఉపశమనాన్ని అందిస్తుంది.

03.ఆహారంలో పీచు పదార్థాలు


తరచుగా ఉబ్బరం సమస్యతో బాధపడుతుంటే, ఆహారంలో ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. రోజులో ఎక్కువ ఫైబర్ తినడం వల్ల ఫ్రీ మోషన్ అవుతుంది. దాంతో కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది. ఆహారంలో ఎక్కువ కూరగాయలు, పండ్లను చేర్చుకోవడం ద్వారా ఫైబర్ ఎక్కువగా వెళుతుంది శరీరంలోకి.

04. నీరు ఎక్కువగా..


నీరు ఎక్కువగా తీసుకోవాలి. గ్రీన్ టీని కూడా ప్రయత్నించవచ్చు. అంతేకాకుండా, కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడేవారికి అరటిపండ్లు అద్భుతమైన ఔషధంలా పని చేస్తాయి. సోంపు గింజలు నీటిలో వేసి మరగపెట్టి ఆ నీటిని తాగుతుంటే కూడా కడుపు ఉబ్బరం తగ్గుతుంది. పెరుగు కూడా అద్భుతంగా పనిచేస్తుంది.

05. నడక లేదా వ్యాయామం


పొట్ట నిండుగా లేదా ఉబ్బరంగా అనిపించినప్పుడు, నడక లేదా యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. శరీరాన్ని కదిలించడం వల్ల కడుపు కండరాలు సంకోచించబడతాయి. పొట్ట ప్రేగులలోని అదనపు వాయువు బయటకు వెళ్లిపోతుంది. ఇలా చేయడం వలన కొన్ని నిమిషాల్లో మీ బాడీ తేలికగా, రిలాక్స్‌గా అనిపించవచ్చు. కడుపులోని గ్యాస్ తగ్గించే ఆసనాలు.. పవనముక్తాసన, పాదహస్తాసన, రాబిట్ పోస్ వంటి ఫార్వర్డ్ బెండ్ యోగా భంగిమలు ఉబ్బరం సమస్య నుండి బయటపడటానికి సహకరిస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story