Sugarcane: వేసవిలో చెరకు రసం.. మండే ఎండ నుంచి ఉపశమనం..

Sugarcane: వేసవిలో చెరకు రసం.. మండే ఎండ నుంచి ఉపశమనం..
Sugarcane: చెరకు రసంలో ఆల్కలీన్ లక్షణాలు ఉండడం వలన ఇది అసిడిటీ, కడుపు మంటను దూరం చేస్తుంది.

Sugarcane: వేసవిలో ఎక్కడ చూసినా చెరకు బండ్లు కనిపిస్తుంటాయి.. మండే ఎండలో ఓ గ్లాస్ చల్లగా చెరకు జ్యూస్ తాగితే ప్రాణం లేచి వచ్చినట్లుంటుంది. చెరకు రసం అలసిన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది.

ఇది అనేక సమస్యలకు సహజ నివారణిగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది ఇన్ఫెక్షన్‌లతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది . ఇందులో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఇతర ఎలక్ట్రోలైట్‌లు పుష్కలంగా ఉంటాయి.

ఇది సాధారణ జలుబుతో పాటు ఇతర ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. శరీరం యొక్క ప్రోటీన్ స్థాయిలను పెంచుతుంది.

చెరకు రసం యొక్క మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు..

1. చెరకు రసం మూత్రవిసర్జన సమస్యలను నిర్మూలిస్తుంది. మూత్ర సంబంధిత వ్యాధులను, మూత్రపిండాల్లో రాళ్లను నయం చేయడంలో సహాయపడుతుంది. మూత్రపిండాలు సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.

2. ఆయుర్వేదం ప్రకారం, చెరకు రసం కాలేయాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అందువలన కామెర్లు వంటి వ్యాధులకు చక్కటి నివారణగా సూచించబడింది.

3. చెరకు రసం యొక్క మరొక ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనం ఏమిటంటే, ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఐరన్, పొటాషియం ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రత్యేకించి వేసవి నెలల్లో , ఒక గ్లాసు చల్లటి చెరకు రసం శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది.

4. ఆయుర్వేదం ప్రకారం చెరకు రసం ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. చెరకు రసంలో ఆల్కలీన్ లక్షణాలు ఉండడం వలన ఇది అసిడిటీ, కడుపు మంటను దూరం చేస్తుంది.

5. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉంటుంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తీసుకోవచ్చు. చెరకు రసం తాగడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెద్దగా మారవని ఒక అధ్యయనంలో తేలింది. అయితే మీరు వీటిని తాగడం ప్రారంభించే ముందు తప్పనిసరిగా మీ వైద్యుడిని సంప్రదించడం అవసరం.

6. చెరకు రసంలో ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి దంత సంబంధిత సమస్యలను నివారిస్తుంది. నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. వేసవి నెలల్లో చెరకు రసం తప్పనిసరిగా తాగడానికి ప్రయత్నించాలి. అయితే చెరకు బండ్ల దగ్గర వాడే ఐస్ వాడకపోవడమే మంచిది. చెరకు రసంలో అల్లం, నిమ్మరసం వేసి అందిస్తున్నారు.. దీంతో మరిన్ని ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.

Tags

Read MoreRead Less
Next Story