Summer tips: వేసవి వేడిని అధిగమించడానికి సులభమైన మార్గాలు

Summer tips: వేసవి వేడిని అధిగమించడానికి సులభమైన మార్గాలు
Summer tips: ఏప్రిల్, మేనెలల్లో ఎండలు మండుతుంటాయి. వేడి గాలులు వీస్తుంటాయి. చెమటలు ఎక్కువగా పట్టడంతో అలసట, తలనొప్పి,నీరసం వంటి లక్షణాలన్నీ సంభవిస్తాయి

Summer tips: ఏప్రిల్, మేనెలల్లో ఎండలు మండుతుంటాయి. వేడి గాలులు వీస్తుంటాయి. చెమటలు ఎక్కువగా పట్టడంతో అలసట, తలనొప్పి,నీరసం వంటి లక్షణాలన్నీ సంభవిస్తాయి అని హిమాలయన్ ఆర్గానిక్స్ సీనియర్ కన్సల్టెంట్ డైటీషియన్ సంచిత్ పాఠక్ వివరించారు.

వేసవికాలం వేడి అనేక దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. వేడిలో ఎక్కువ సమయం గడుపుతుంటే, అది మీ ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.

వడదెబ్బతో పాటు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు కూడా ఈ సీజన్‌లో ఎక్కువగా ఉంటాయి. "వేడి వల్ల కిడ్నీ ఆరోగ్యం, చర్మ వ్యాధులు, తట్టు, కామెర్లు వంటి వ్యాధులు చుట్టుముడతాయి. గర్భిణీ స్త్రీలలో ముందే ప్రసవం వంటి సమస్యలు తలెత్తుతాయి.

శరీరంలో మెదడు, నాడీ వ్యవస్థల పనితీరుకు కీలకమైన సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్‌ల ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి ఎండ వేడి కారణంగా శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్‌లను తిరిగి నింపడానికి తగిన మొత్తంలో నీరు త్రాగడం తప్పనిసరి.

వీలైనంత వరకు ఎండవేడికి శరీరం ఎక్స్ పోజ్ కాకుండా ఉంటే మంచిది.. ఉదయం లేదా సాయింత్ర సమయాల్లో మాత్రమే బయటకు రావడం ఉత్తమం.

వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. నీరసం, నిస్సత్తువగా అనిపించినప్పుడు చల్లని వాతావరణంలో విశ్రాంతి తీసుకోవాలి. ఆరోగ్యకరమైన తేలికపాటి భోజనం తినడం ఉత్తమం. అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లతో కూడిన భోజనానికి దూరంగా ఉండాలి.

కొవ్వులు శరీరంలో వేడిని పెంచుతాయి. వీటికి బదులుగా, అధిక నీటి కంటెంట్ ఉన్న తాజా పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. మిమ్మల్ని మీరు చల్లగా ఉంచుకోవడానికి, పుచ్చకాయ, నారింజ, , కొబ్బరి నీళ్లు, దోసకాయ, టొమాటోలు, పుదీనా, మెంతులు మొదలైన వాటిని తీసుకోవాలి. ఆల్కహాల్, ఫిజీ డ్రింక్స్, కాఫీ వంటి వాటికి దూరంగా ఉండాలి.

పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, మంచి చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. అవి మీకు శక్తిని ఇస్తాయి, వాటిని తీసుకున్నప్పుడు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇవి చర్మ ఆరోగ్యానికి, వెంట్రుకల పెరుగుదలకు ఉపయోగపడతాయి. వీటిలో ఉన్న ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంలో కూడా సహాయపడతాయి.

వేసవిలో, చర్మం యొక్క సేబాషియస్ గ్రంథులు సహజ నూనెను ఉత్పత్తి చేస్తాయి. ఈ నూనె చర్మం యొక్క ఉపరితలంపై అంటుకుని చర్మ రంద్రాలను మూసివేస్తుంది. దీని వలన చర్మం పొడి బారినట్లు అనిపిస్తుంది. వేసవిలో మొటిమలు, పొడి చర్మం, అలెర్జీ, వేడి దద్దుర్లు వంటి చర్మ సమస్యలు తలెత్తుతాయి.

ముఖం తరచుగా కడగడం లేదా చెమటతో ఉన్న ముఖాన్ని తుడవడం కోసం టిష్యూలను ఉపయోగించడం వల్ల మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది. కలబంద గుజ్జు లేదా గంధపు పొడితో సహజమైన ఫేస్ ప్యాక్‌లను వేసుకుంటే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

వేసవిలో జుట్టు సంరక్షణ అత్యంత కీలకమైంది.వారానికి ఒకసారి హెయిర్ మాస్క్‌ని అప్లై చేయాలి. ఆయిల్ మసాజ్ చేస్తే వేడి కారణంగా వచ్చే తలనొప్పుల నుంచి దూరంగా ఉండొచ్చు.

స్ట్రాబెర్రీలు, అరటిపండ్లు, గుమ్మడికాయ, టొమాటోలు , కాయధాన్యాలు, అవిసె గింజలు, వాల్‌నట్‌లు వంటివి వేసవిలో చర్మానికి, జుట్టుకు మేలు చేసే బ్యూటీ ఫుడ్స్. అదనంగా, ఇవి విటమిన్ ఎ సి బయోటిన్, జింక్‌లను అందిస్తాయి. ఇవి చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story