Vitamin D : విటమిన్ D లేనివారు వీటిని తినండి..!

Vitamin D : విటమిన్ D లేనివారు వీటిని తినండి..!
Vitamin D : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి విటమిన్స్ తప్పనిసరి.. ఇందులో విటమిన్ డి ఒకటి.. విటమిన్ డి వలన ఎముకల ఆరోగ్యంగా ఉంటాయి.

Vitamin D : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి విటమిన్స్ తప్పనిసరి.. ఇందులో విటమిన్ డి ఒకటి.. విటమిన్ డి వలన ఎముకల ఆరోగ్యంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ మంది ప్రజలు విటమిన్ డి లోపంతో ఉన్నారని అంచనా.. విటమిన్ డీ ఉండడం వలన రోగ నిరోధక శక్తి పెరగడమే కాుండా.. కీళ్ల నొప్పులను కూడా నియంత్రించవచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు ఎలాంటి పదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

డైలీ గుడ్డు తీసుకోవాలి. గుడ్డులోని పచ్చసోనలో విటమిన్ డి ఉంటుంది. అంతేకాకుండా గుడ్డువలన శరీరానికి శక్తి కూడా వస్తుంది.

♦ పాలల్లో విటమిన్ డి తో పాటుగా పోషకాలు అధికంగా ఉంటాయి కాబట్టి రోజు పాలు తాగడం అలవాటు చేసుకోవాలి.

♦ పుట్టగొడుగులతో విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు. పుట్టగొడుగులలో విటమిన్ బి1, బి2, బి5, విటమిన్ సి, మెగ్నీషియం లభిస్తాయి.

♦ రోజు పెరుగు తినడం వలన విటమిన్ డి లోపాన్ని తగ్గించవచ్చు. పెరుగు తినడం వలన కడుపు సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.

♦ చేపల నుంచి కూడా విటమిన్ డి పొందవచ్చు. అయితే దీనికోసం సాల్మన్, ట్యూనా వంటి చేపలు తినాలి.

♦ నారింజలో విటమిన్ సి తో పాటుగా విటమిన్ డి కూడా ఉంటుంది. నారింజ పండ్లను తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

♦ గోధుమలు, బార్లీ, ఇతర ధాన్యాలను తీసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story