Things not to keep at Home: ఇంట్లో ఈ వస్తువులు ఉంటే మీ డబ్బు గోవింద..

Things not to keep at Home: ఇంట్లో ఈ వస్తువులు ఉంటే మీ డబ్బు గోవింద..
ప్రతి ఇంట్లో అలంకారం కోసం లేదా ఇల్లు అందంగా కనిపించడం కోసం అందంగా ఉండే వస్తువులతో అలంకరిచుకుంటారు చాలా మంది.

Things not to keep at Home: ప్రతి ఇంట్లో అలంకారం కోసం లేదా ఇల్లు అందంగా కనిపించడం కోసం అందంగా ఉండే వస్తువులతో అలంకరిచుకుంటారు చాలా మంది. దేవుని బొమ్మలు, అందమైన పువ్వులు, ఆహ్లాదకరంగా ఉండే ప్రకృతి సీనరీల వంటి వివిధ వస్తువులతో ఇంటిని ఎంతో అందంగా మార్చుకుంటారు. ఆర్థికంగా బలంగా ఉన్నవాల్లైతే ఇలాంటి వాటికోసం ప్రత్యేక నిపుణులని సైతం తెప్పించుకుని ఇంటిని అందంగా డెకరేట్ చేయించుకుంటారు. వీటికోసం లక్షల్లో డబ్బుని ఖర్చుపెడతారు. అంత ప్రాధాన్యత చూపిస్తారు ఇంటి అలంకరణ కోసం.

కానీ.. ఇంట్లో ఉండే వస్తువుల గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో.. ఇంట్లో ఉండకూడని వస్తువుల గురించి కూడా అంతే శ్రద్ధ వహించాలంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇల్లు అందంగా కనిపించాలని కనిపించిన ప్రతి వస్తువునీ తెచ్చి పెట్టుకోవడం వల్ల అనవసర తలనొప్పులు తెచ్చుకున్నట్టే అంటున్నారు. వీటివల్ల అనేక రకాల కుటుంబ సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.

అసలు ఇంట్లో ఉండకూడని వస్తువులు ఏంటి.? వాటివల్ల మనకు ఎదురయ్యే సమస్యలు ఏంటి.? ఒకవేళ ఇప్పటికే మన ఇళ్లలో అలాంటి వస్తువులు ఉంటే వాటిని ఏం చేయాలి అనేవి ఇప్పుడు మనం తెల్సుకుందాం.

ముందుగా ఇంట్లో విరిగిపోయిన, పగిలిపోయిన బొమ్మలు ఉండకుండా చూసుకోవాలి. కొంత మంది గిఫ్ట్ ఇచ్చిందనో లేదా వాటి పైన ఉన్న ఇష్టం వల్లనో మరే ఇతర కారణాల వల్లనైతేనేమి వాటిని పడేయడానికి ఇష్టపడరు. కానీ.. అలాంటి వస్తువులని ఇంట్లో ఉంచుకోవడం వల్ల సమస్యలు రెట్టింపవుతాయి. మానసిక అశాంతి, ఇంట్లో గొడవలు వంటివి తలెత్తుతాయి.



ఇంకా ఇంట్లో లీకవుతున్న నల్లాలు ఉండకూడదు. దీనివల్ల ఇంట్లో ఆర్ధిక సమస్యలు ఎక్కువవుతాయి. సంపాదించిన ధనం కూడా నిలవ ఉండదు. వ్యాపారంలో అనుకోని నష్టాలు సంభవిస్తాయి. అందుకే కిచెన్‌లోనో, బాత్‌రూమ్‌లోనో ఇలా ఎక్కడైనా ఇంట్లో లీక్ అయ్యే నల్లాలు ఉంటే వాటిని వెంటనే రిపేర్ చేయించుకోండి.. నీరు వృధా కాదు.. డబ్బూ పోదు.

చాలా మంది అందంగా ఉన్నారని చిన్న పిల్లల ఫోటోలను ఇంట్లో గోడలకి పెట్టుకుంటారు. నవ్వుతున్న పిల్లల ఫోటోలు పెట్టుకుంటే ఫరవాలేదు. కానీ.. కొంత మంది క్యూట్ గా, ముద్దుగా ఉన్నారని ఏడ్చే పిల్లల ఫోటోలు పెట్టుకుంటారు. ఇలా.. ఏడుస్తున్న పిల్లల ఫోటోలు కూడా ఇంట్లో ఉండకూడదు. దీనివల్ల ఇంట్లో ఆడవాళ్ళు తరుచుగా అనారోగ్యం బారినపడే అవకాశం ఉంది.



కొంతమంది సముద్రాలు, పడవలు, ఓడలు వంటివి కూడా సీనరీ బాగుందని ఇంట్లో గోడలకి తగిలిస్తారు. టైటానిక్ మూవీపైన ఉన్న ఇష్టంతో కూడా మునిగిపోతున్న ఆ పడవ ఫోటోలు పెట్టుకుంటారు. కాని మునిగిపోయే పడవలు ఉండే ఫొటోస్ గాని, బొమ్మలు గాని ఇంట్లో ఉండకూడదు. ఇలాంటి బొమ్మలు ఇంట్లో ఉంటే కుటుంబ సమస్యలు ఎక్కువవుతాయి.



అన్నిటికన్నా ముఖ్యంగా.. ఇంట్లో ఆగిపోయిన, పాడైపోయిన, పగిలిపోయిన గడియారాలు ఉండకూడదు. ఒకవేళ ఉంటె వెంటనే వాటిని అక్కడినుండి తీసివేయాలి. వాటిని రిపేర్ చేయించడమో లేదా బ్యాటరీలు మార్చాడం వంటివి చేయాలి. అది రన్నింగ్ కండిషన్‌‌లో ఉంటేనే ఇంట్లో ఉంచండి లేదంటే పడేయండి. పనిచేయని గడియారాలు ఇంట్లో ఉండటం వల్ల జీవితంలో ఎదుగుదల ఉండదు.



పూజ గదిలో ఉండే దేవుడి పటాలు కుడా పాతవి ఉంచకూడదు. అంటే.. ఆ ఫోటోలు పూజ గదిలో చాలా రోజులుగా ఉండి, దేవుడి రూపం కూడా కనిపించనంతగా మారిపోయి ఉన్న పటాలు పూజ గదిలో ఉంచడం మంచిదికాదు. కొంత మంది విరిగిపోయిన దేవుని విగ్రహాలని కూడా పూజ గదిలో ఉంచి వాటికి పూజలు చేస్తుంటారు. అలా చేయడం మంచిది కాదు. పాత దేవుని చిత్ర పటాలు, విగ్రహాలు ఉంటే వాటిని దగ్గరలో ఉన్న ఆలయంలో గాని.. పారే నదిలో గాని వేస్తే సరిపోతుంది.



క్రూరమృగాల బొమ్మలు, యుద్ద సన్నివేశాన్ని ప్రతిబింబించే ఫోటోలు వంటివి కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. వీటివల్ల నెగిటివ్ ఎనర్జీ పాసవుతుంది.. ఇంట్లో అశాంతి తలెత్తుతుంది. వీటి బదులుగా అందంగా ఉండే ఫ్లవర్స్, నేచర్ గ్రీన్ సినరీ, వాటర్ ఫాల్స్ వంటి చిత్ర పటాలు, బుద్దుని బొమ్మలు పెట్టుకోవడం చాలా మంచిది. వీటి వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడి.. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీలైతే ఇండోర్ ప్లాంట్స్.. అవీ కుదరదంటే గాజు సీసాల్లో మనీ ప్లాంట్స్ లాంటి మొక్కలు పెట్టుకుంటే ఇల్లు అందంగా, కంటికి ఆరోగ్యంగా ఉంటుంది.





Tags

Read MoreRead Less
Next Story