Human Body : మానవ శరీరంలో మనకి తెలియని ఎన్నో రహస్యాలు..

Human Body : మానవ శరీరంలో మనకి తెలియని ఎన్నో రహస్యాలు..
Human Body : వాటి గురించే తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవల్సిందే. మన శరీరం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Intresting facts about human body: మానవ శరీరంలో మనకి తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటి గురించే తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవల్సిందే. మన శరీరం గురించి మనకు తెలియని కొన్నిఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. మనిషికి నిద్ర అనేది ఎంతో ప్రశాంతతను, విశ్రాంతిని ఇస్తుంది. కానీ.. ఎంతమందికి తెలుసు నిద్రలో అయిదు దశలు ఉంటాయని. మనిషికి అయిదవ దశలోనే గాఢమైన నిద్రపడుతుందట. ఇలా గాఢ నిద్రలో ఉన్నప్పడే మనిషి మెదడు చురుకుగా పనిచేస్తుందట. గాఢ నిద్ర కారణంగానే 90 శాతం కలలు మనకి గుర్తుండవు.

2. మానవ శరీరం రక్తకణాలతో నిండి ఉంటుంది. శరీరంలోని అన్ని రక్తనాళాలను వరుసగా పరిస్తే దాదాపు 1,00,000 మైళ్ల పొడుపు ఉంటుందట.

3. మన ఊపిరితిత్తుల సర్‌ఫేస్ ఏరియా సుమారు 50 నుంచి 75 స్క్వేర్ మీటర్లు. అంటే ఒక టెన్నీస్ కోర్టు అంత ఉంటుంది.

4. శిశువు గర్భంలో ఉన్నప్పుడే హస్తరేఖలతో పాటు ఫింగర్ ప్రింట్స్ కూడా వచ్చేస్తాయి. పిండం ఆరు నెలల వయసు ఉన్నప్పుడే ఇవి ఏర్పడతాయి.

5. మనిషి శరీరంలో ఒక సెకనుకు 300 మిలియన్ల కణాలు చనిపోతూ.. మరో 300 మిలినయన్ల కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. మనిషి ప్రాణంతో ఉండేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.

6. మనిషి ఊపిరి పీల్చుకోవడం, మింగడం ఈ రెండు పనులని ఒకేసారి చేయలేరు. ఎందుకంటే.. ఆహారాన్ని మింగుతూ.. ఊపిరి తీసుకుంటే ఆహారం గొంతులో ఇరుక్కుపోయి.. ఊపిరి ఆడదు. కానీ.. పసిపిల్లలు ఈ రెండు పనులని ఒకేసారి సునాయాసంగా చేయగలరు.

7. మానవ శరీరం అంతటా నిరంతరం రక్తంప్రసారం జరుగుతూ ఉంటుంది. కానీ.. బాడీలో రక్తప్రసారం లేని ఏకైక భాగం కంటిలోని కార్నియా. ఇది గాలి నుంచే నేరుగా ఆక్సిజన్ ని గ్రహిస్తుందట.

8. మనిషి తల వెంట్రుకలు చలికాలంలో కంటే వేసవి కాలంలో వేగంగా పెరుగుతాయి.

9. మనిషి ఆహారం లేకపోయినా.. తన శరీర సౌష్టవాన్ని బట్టి కొన్ని వారాల పాటు బతకగలడు. కానీ.. నిద్ర లేకుండా మాత్రం 11 రోజుల కంటే ఎక్కవ బతకలేడు.

10. స్త్రీ శరీరంలోని అతి పెద్ద కణాలు 'అండాలు'.. పురుష శరీరంలో అతి చిన్నవి వీర్య కణాలు. వీర్య కణం కంటే అండం సుమారు 30 రెట్లు పెద్దగా ఉంటుంది. ఈ రెండిటి కలయిక వల్లనే మనిషి పుట్టుక మొదలవుతుంది.

11. మన బ్రెయిన్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ ఒక మిలియన్ జిగా బైట్స్ వరకు ఉంటుంది.

12. నోటి దవడ వెనుక భాగంలోని ఉండే కండరమే శరీరంలోని అత్యంత బలమైన కండరం. నోరు తెరవాలన్నా, మూయాలన్నా ఈ కండరం పనిచేయాల్సిందే.

13. మానవ మెదడు నుంచి వచ్చే సంకేతాలు గంటకు 268 మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి.


Tags

Read MoreRead Less
Next Story