ఆయుర్వేదిక్ హోం రెమిడీ.. తెల్ల జుట్టు నల్లగా..

ఆయుర్వేదిక్ హోం రెమిడీ.. తెల్ల జుట్టు నల్లగా..
30 ఏళ్లు కూడా రాలేదు.. అప్పుడే ముసలాడివి అయిపోయావేంట్రా.. నెత్తి మీద ఆ తెల్ల వెంట్రుకలేంటి. ఏదైనా రంగేసుకోకూడదు.. ఫ్రెండ్స్ సలహా.

30 ఏళ్లు కూడా రాలేదు.. అప్పుడే ముసలాడివి అయిపోయావేంట్రా.. నెత్తి మీద ఆ తెల్ల వెంట్రుకలేంటి. ఏదైనా రంగేసుకోకూడదు.. ఫ్రెండ్స్ సలహా.సిల్వర్ తీగల్లా నెత్తిమీద తెల్లగా మెరుస్తున్న వెంట్రుకలు ఒకటీ రెండే కదా అని పీకే ప్రయత్నం చేస్తే వెంట్రుకల కుదుళ్లకు అంటుకున్న రసాయనం ద్వారా మరి కొన్ని వెంట్రుకలు తెల్లబడే అవకాశం ఉంటుంది. తీసుకునే ఆహారం, బయట పొల్యూషన్ వెరసి జుట్టు ఊడడం, వెంట్రుకలు తెల్లబడడం చిన్నా పెద్దా అందరిలో కామన్ అయిపోయింది.

తెల్ల వెంట్రుకలకు వయసుతో పనిలేకుండా పోయింది. మార్కెట్లో అమ్మే పలు రకాల క్రీములు, పౌడర్లు అందరికీ సరిపడవు. అదే సహజ సిద్దంగా లభించే వాటితో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే ఆయుర్వేద చిట్కా నిపుణులు సూచించారు. ఇందులో వాడే పదార్థాలు..

ముందుగా టీ డికాషన్ తయారు చేసుకోవాలి. కప్పు నీటిలో టీ పొడి రెండు స్పూన్లు, కాఫీ పొడి రెండు స్పూన్లు వేసి చిన్న మంట మీద మరిగించి వడకట్టాలి. ఆ తరువాత ఐరన్ పాన్‌లో రెండు స్పూన్లు ఉసిరి పొడి, రెండు స్పూన్లు బృంగరాజ్ పౌడర్, రెండు స్పూన్లు ఇండిగో పౌడర్ వేయాలి. ఈ మొత్తాన్ని రెండు నిమిషాలు వేగించి కొంచెం వాటర్ వేసి ఉడికించాలి.

ఈ మిశ్రమాన్ని ఓ గంట పక్కన పెడితే నల్ల రంగులోకి మారిపోతుంది. అప్పుడు చల్లారిన డికాషన్ వేసి బాగా కలిపి తలకు పట్టించాలి. ఓ గంట ఉంచుకుని ఆ తరువాత తలని గోరు వెచ్చని నీటితో కడగాలి. వీలైతే చన్నీళ్లతో కడిగితే మంచిది. మరుసటి రోజు తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

Tags

Read MoreRead Less
Next Story