బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మరో బ్యూటీ..

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మరో బ్యూటీ..
మీ రెండు కళ్లూ వేసి ఉంచాలన్న హోస్ట్ నాగార్జున మాటల్ని అక్షరాలా ఆచరిస్తున్నారు సగటు ప్రేక్షకులు.

బయట సినిమాల్లేవ్.. పార్టీలు పబ్బులు అసలే లేవ్.. ఆఫీస్ నుంచి వచ్చి టీవీ ఆన్ చేస్తే అందులో ఏది వస్తే అదే కాలక్షేపం ఈ కరోనా కాలంలో.. అందుకేనేమో బిగ్‌బాస్ షో టీఆర్‌పీ రేటింగ్‌లో దూసుకుపోతోంది.. ఓ పక్క ఐపీఎల్ ఆటని చూడాలనుకున్నా, బిగ్‌బాస్ హౌస్‌పై ఒక కన్ను కాదు మీ రెండు కళ్లూ వేసి ఉంచాలన్న హోస్ట్ నాగార్జున మాటల్ని అక్షరాలా ఆచరిస్తున్నారు సగటు ప్రేక్షకులు. అయితే సీజన్ 4 చప్పగా సాగడం ఆడియన్స్‌ని నిరాశకు గురి చేస్తోంది.. ఈ రోజు హౌస్‌లో ఏం జరగబోతోంది అన్న క్యూరియాసిటీ ఏం కనిపించట్లేదు.. అరుపులు, తిట్లు, గ్రూపు రాజకీయాలు.. మరి కొత్తగా వచ్చే ఈ భామ ఏం చేస్తుందో చూడాలి.

తొలివారం సూర్యకిరణ్ ఎలిమినేట్ అయిన తరువాత ఇద్దరు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి పంపించారు. ఈ వారం మరో కంటెస్టెంట్ తెలుగు, తమిళ, బెంగాలీ చిత్రాల్లో నటించిన స్వాతి దీక్షిత్‌ను హౌజ్‌లోకి పంపించనున్నట్లు సమాచారం. నామ్, లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, సింబా చిత్రాలు స్వాతికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన జంప్ జిలానీ చిత్రంలోనూ స్వాతి హీరోయిన్‌గా నటించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ క్వారంటైన్ పూర్తి చేసుకున్న ఆమె ఈ వారం హౌస్‌లోకి ఎంటరవబోతోందని తెలిసింది.

Tags

Read MoreRead Less
Next Story