ఆమెకు అంగవైకల్యం అడ్డురాలేదు.. తొమ్మిదేళ్లనుంచి రెండు గ్రామాలకు సర్పంచ్‌గా..

ఆమెకు అంగవైకల్యం అడ్డురాలేదు.. తొమ్మిదేళ్లనుంచి రెండు గ్రామాలకు సర్పంచ్‌గా..
నీకు నువ్వే చేసుకోలేవు.. ఇంక మాకేం చేస్తావు అన్నవారికి తన మాటల ద్వారా కాక చేతల ద్వారానే చేసి చూపించింది.

అయ్యో పాపం.. అంటే ఆమెకు విపరీతమైన కోపం.. అంగవైకల్యం మనిషికే కాని మనసుకి కాదు.. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారికంటే నేనేమీ తక్కువకాదు అని నిరూపిస్తోంది మహరాష్ట్ర నాసిక్ జిల్లాలోని దిందోరి గ్రామానికి చెందిన 34 ఏళ్ల కవితా భోండ్వే. సర్పంచ్‌గా ఆమె తన 9 సంవత్సరాల పదవీకాలంలో గ్రామాలకు రోడ్లు, త్రాగునీటి సరఫరా, పేదలకు ఇళ్లు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. 25 సంవత్సరాల వయసులోనే సర్పంచ్‌గా మారిన భోండ్‌వే ఇప్పుడు రెండోసారి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నీకు నువ్వే చేసుకోలేవు.. ఇంక మాకేం చేస్తావు అన్నవారికి తన మాటల ద్వారా కాక చేతల ద్వారానే చేసి చూపించింది. అందుకే రెండోసారి కూడా సర్పంచ్‌గా ఎన్నికైంది. "నేను శారీరకంగా సరిగా లేకపోవచ్చు. కాని మానసికంగా చాలా స్ట్రాంగ్ అంటుంది భోండ్వే. కొంత మంది ప్రజలు నా వైకల్యాన్ని ఎగతాళి చేస్తారు. అలాంటి వారిని నేను పట్టించుకోదలుచుకోలేదు. నా కుటుంబం ఎప్పుడూ నాకు మద్దతు ఇస్తుంది. నా సోదరుడు, తండ్రి నన్ను ఆఫీసుకు తీసుకువెళ్లడం, తిరిగి తీసుకురావడం చేస్తారు. 25 సంవత్సరాల వయస్సులో సర్పంచ్ అయ్యాను అనే విషయం చాలా మందికి నచ్చలేదు "అని భోండ్వే చెప్పారు.

ఆమె గ్రామ పంచాయతీ వ్యవహారాల్లో గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది. ఈ ప్రాంతంలో జరిగే అక్రమ వ్యవహారాలకు కళ్లెం వేసేవారు. ఎన్నికలలో పోటీ చేయడానికి తనను తండ్రి ప్రోత్సహించినట్లు చెబుతుంది. భోండ్వే తండ్రి పుండాలిక్ భోండ్వే 15 సంవత్సరాలు గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఉన్నారు, కాని తరువాత విద్య లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి, 2011 లో, తన కుమార్తెను ఎన్నికల్లో పోటీ చేయమని సలహా ఇచ్చారు.

అయితే, ఇంతకు ముందు గ్రామ పంచాయతీతో సంబంధం లేకపోయినా కవితా భోండ్వే సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె దహేగావ్, వాగ్లుడ్ గ్రామాలలో మహిళల స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. మొదటి పదవీకాలం పూర్తయిన తర్వాత, ఆమె మళ్ళీ ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నికయ్యారు. భోండ్వే గత తొమ్మిదేళ్లలో గ్రామాల్లో ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కాంక్రీట్ రోడ్లు, గ్రామాల ఇళ్ల నిర్మాణంలో ఆమెముఖ్యపాత్ర పోషించారు.

బాలికలకు విద్య యొక్క ప్రాధాన్యతను తెలిపేందుకు అవిరళ కృషి చేస్తున్నారు. "ఆమె సర్పంచ్ అయ్యాక, మాకు కాంక్రీట్ రోడ్లు వచ్చాయి. గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించారు. మా గ్రామంలో అభివృద్ధి పనులు చేయడానికి ఆమె ఎప్పుడూ చొరవ తీసుకుంటుంది, "అని ఒక స్థానికులు తమ సర్పంచ్ కవితా భోండ్వే గురించి గొప్పగా చెబుతారు.

Tags

Read MoreRead Less
Next Story