రాష్ట్రాన్ని వణికిస్తున్న జ్వరాలు.. 32 మంది చిన్నారులు మ‌ృతి

రాష్ట్రాన్ని వణికిస్తున్న జ్వరాలు.. 32 మంది చిన్నారులు మ‌ృతి
తాజాగా ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌లో అనుమానాస్పద డెంగ్యూ లాంటి జ్వరం కారణంగా 32 మంది చిన్నారులతో సహా ఏడుగురు పెద్దలు..

ఒకటి పోతే మరొకటి.. జనం వణికి పోతున్నారు. కరోనా ఇంకా తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది.. అసలే వర్షాకాలం.. వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వైరస్‌లు కబళిస్తుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌లో అనుమానాస్పద డెంగ్యూ లాంటి జ్వరం కారణంగా 32 మంది చిన్నారులతో సహా ఏడుగురు పెద్దలు మృత్యువాత పడ్డారు. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఫిరోజాబాద్‌లోని 100 పడకల ఆస్పత్రిని సందర్శంచి పరిస్థితిని సమీక్షించారు. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న మరికొంత మంది చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి సహాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఫిరోజాబాద్ ఎమ్మెల్యే జిల్లా అధికారులను నిందించారు

మథుర, ఫిరోజాబాద్ మరియు మెయిన్‌పురితో సహా పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలలో "వైరల్ ఫీవర్" కేసులు పెరిగాయి. దీంతోనోయిడాలోని జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే మనీష్ అసిజా ఆదివారం ఈ వ్యాధితో గత వారం 40 మంది పిల్లలు మరణించారని పేర్కొన్నారు. ఈ వాదనను ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ సింగ్ ఖండించారు. అతను అసిజా వాదనలు తప్పు అని పేర్కొన్నారు. తమకు అలాంటి నివేదికలు రాలేదని పేర్కొన్నారు.

డెంగ్యూ నిరోధక వ్యాప్తికి తగిన చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు. పరిసరాలు శుభ్రపరిచే పని కోసం పౌరసంఘం ఇచ్చిన 50 వాహనాలను ఉపయోగించకపోవడంపై అసిజియా ఆదివారం ఆరోగ్య శాఖ మరియు జిల్లా అధికారులను తప్పుపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story