దేశవ్యాప్తగా 121మంది ప్రజాప్రతినిధులపై సీబీఐ కేసులు ..!

దేశవ్యాప్తగా 121మంది ప్రజాప్రతినిధులపై సీబీఐ కేసులు ..!
మొత్తం 121మంది ప్రజాప్రతినిధులపై సీబీఐ కేసులు, 122 నేతలపై ఈడీ కేసులు ఉన్నట్టు తెలిపింది. విచారణ వేగవంతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించారు.

దేశవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులపై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల వివరాల్ని అమికస్‌ క్యూరీ సుప్రీంకు అందంచారు. మొత్తం 121మంది ప్రజాప్రతినిధులపై సీబీఐ కేసులు, 122 నేతలపై ఈడీ కేసులు ఉన్నట్టు తెలిపింది. విచారణ వేగవంతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించారు. ఈ నివేదికపై సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ.. మందకొడిగా సాగుతోందని సుప్రీంకు అమికస్ క్యూరీ వివరించారు. ఏళ్లతరబడి కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపారు. ఏళ్లతరబడి కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయని వెల్లడించారు. త్వరితగతిన కేసుల విచారణ జరిగేందుకు... తగిన ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును అమికస్ క్యూరీ కోరారు.

అటు... ప్రజాప్రతినిధులపై విచారణ పర్యవేక్షణకు సీజేఐ మాజీ న్యాయమూర్తి లేదా.. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో.. కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టును అమికస్ క్యూరీ కోరారు. సీబీఐ, ఈడీ డైరెక్టర్లను కమిటీలో నియమించాలని అన్నారు. సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న 121 మందిలో 51 మంది తాజా మాజీ ఎంపీలు, 14 మంది సిట్టింగ్, 37 మంది మాజీ ఎంపీలు ఉన్నట్టు పేర్కొంది. ఓ ప్రజా ప్రతినిధిపై కేసు 20 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉందని వెల్లడించారు. 121 కేసుల్లో 58 కేసుల్లో జీవిత ఖైదు, 48 కేసుల్లో సుదీర్ఘ కాలం శిక్ష పడే అవకాశముందని పేర్కొన్నారు. ఇక... 51 మంది తాజా, మాజీ ఎంపీలపై మనిలాండలింగ్ కేసులు ఉన్నాయని అమికస్‌ క్యూరీ వివరించారు. మరోవైపు.. ప్రజా ప్రతినిధులపై కేసుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు... ఉపసంహరించుకుంటున్నాయని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story