అకౌంట్లోకి రూ.10 కోట్లు.. ఎలా వచ్చాయో తెలియదంటూ..

అకౌంట్లోకి రూ.10 కోట్లు.. ఎలా వచ్చాయో తెలియదంటూ..
అయ్ బాబోయ్ అంత డబ్బే.. కాల్ అందుకున్న ఆమె కళ్లు తిరిగి కింద పడింది.

ఉన్న డబ్బులు పోకుండా ఉంటే చాలు.. కొత్తగా వందలు, వేలు, లక్షలు కూడా కాదు కోట్లు.. అదీ పదికోట్లు అకౌంట్లో జమ చేసినట్లు తెలియగానే ఆ అమ్మాయికి గుండె ఆగినంత పనైంది.. అయ్ బాబోయ్ అంత డబ్బే.. కాల్ అందుకున్న ఆమె కళ్లు తిరిగి కింద పడింది. వెంటనే తేరుకుని జీవితమంతా కష్టపడ్డా బ్యాంకులో లక్ష రూపాయలు కూడా దాచిపెట్టుకోలేను.. అలాంటిది.. రూ.10కోట్లు.. ఇందులో ఏదో మోసం ఉందని బ్యాంకుకు పరిగెట్టింది.

ఉత్తరప్రదేశ్‌లోని బల్ధియా జిల్లాకు చెందిన సరోజ్ అనే 16 ఏళ్ల అమ్మాయికి కాన్పూర్ దేహాట్‌ జిల్లాకు చెందిన నీలేష్ కుమార్ ఫోన్ చేసి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద నిధులు పొందే పేరుతో ఆధార్ కార్డు, ఫోటో పంపమని కోరాడు. సరోజ్ నిరక్షరాస్యురాలు. జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాన్స్‌దిహ్ పట్టణంలోని అలహాబాద్ బ్యాంక్ శాఖలో తనకు 2018 నుంచి ఖాతా ఉందని తెలిపింది. సోమవారం బ్యాంకుకు వెళ్ళినప్పుడు ఖాతాలో 99 9.99 కోట్లు ఉన్నట్లు బ్యాంకు అధికారులు ఆమెకు సమాచారం ఇచ్చారు.

అనంతరం ఆమె పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అధికారులకు సమాచారం ఇచ్చింది. డబ్బు ఎక్కడినుండి వచ్చిందో తనకు తెలియదని సరోజ్ చెప్పారు. తనకు కాల్ చేసిన నీలేష్ కుమార్‌కి ఫోన్ చేస్తే నెంబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని ఆమె పోలీసులకు తెలిపింది. ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నామని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని బాన్స్‌దిహ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story