దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు

దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు
వైరస్ ముంచుకొచ్చేస్తోంది. కుర్రాళ్లు, పెద్దాళ్లు, పిల్లలు తేడా లేనే లేదు. సెకండ్‌ వేవ్‌ చాలా తీవ్రత చూపిస్తోంది. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.

వైరస్ ముంచుకొచ్చేస్తోంది. కుర్రాళ్లు, పెద్దాళ్లు, పిల్లలు తేడా లేనే లేదు. సెకండ్‌ వేవ్‌ చాలా తీవ్రత చూపిస్తోంది. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 2 లక్షల 60 వేలకుపైగా పాజిటివ్‌గా తేలారు. ఈ లెక్కలన్నీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయ్. సరాసరిన గంటకు 10 వేల కేసులు వస్తుంటే.. మరణాలు కూడా ఊహించని రీతిలో పెరుగుతున్నాయ్.

నిన్న 1493 మంది కోవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వారమంతా కూడా 2 లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు బయటపడ్డాయి. తీవ్రత ఈ స్థాయిలో ఉంది అని తెలిసాక కూడా.. జనం జాగ్రత్తలు పాటించకపోవడంతో ముప్పు మరింత పెరుగుతోంది.మార్చి నెలాఖరున కరోనా కేసుల సంఖ్య చూస్తే 50 వేలకు అటుఇటుగా ఉండేది. ఇప్పుడది ఏకంగా 2 లక్షల 60 వేలకు పెరిగింది.

అంటే 3 వారాల వ్యవధిలో అంతా తారుమారు అయిపోయింది. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే కోవిడ్‌ వేల మంది జీవితాల్ని ఖతం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఏప్రిల్‌ 4 నుంచి 10వ తేదీ వరకూ చూస్తే అప్పుడు సరాసరిన లక్ష కేసులు ఉండేవి. ఏప్రిల్‌ 10 తర్వాత ఒక్కసారిగా ఇది 2 లక్షలు దాటేసింది. ఇప్పుడు 3 లక్షలకు చేరువయ్యేలా పరిగెడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story