3వేల కిలోల ఆపిల్స్ తో స్వామినారాయణుడికి ఆరాధన..

3వేల కిలోల ఆపిల్స్ తో స్వామినారాయణుడికి ఆరాధన..
దేవీ నవరాత్రుల కంటే ముందే భక్తుల కోసం శ్రీ స్వామినారాయణ మందిరం తిరిగి ప్రారంభించబడింది.

అహ్మదాబాద్ లోని శ్రీ స్వామినారాయణ మందిరంలో దేవతలకు అర్పించడానికి సుమారు 3,000 కిలోల ఆపిల్స్ ప్రదర్శించబడ్డాయి. ఎరుపు, ఆకుపచ్చ మరియు బంగారు వర్ణంలోని ఆపిల్స్ ని దేవతల ముందు మెట్లపై ప్రసాదంగా ఉంచారు. దేవతా మూర్తుల విగ్రహాలకు ఇరువైపులా నిర్మించిన ప్రత్యేక చెక్క మెట్లపై ఆపిల్స్ ని అలంకరించారు. అక్టోబర్ 17 న ప్రారంభమయ్యే దేవీ నవరాత్రుల కంటే ముందే భక్తుల కోసం శ్రీ స్వామినారాయణ మందిరం తిరిగి ప్రారంభించబడింది. దేశవ్యాప్తంగా నెలకొన్న కోవిడ్ కారణంగా లాక్డౌన్ ప్రకటించిన తరువాత ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉన్న స్వామి నారాయణుని ఆలయం మూసివేయబడింది.

"పూజ అనంతరం, 3 వేల ఆపిల్స్ ను కోవిడ్ రోగులకు, ఆరోగ్య సిబ్బందికి పంపిణీ చేయబడుతుంది" అని ఆలయ పూజారి తెలియజేశారు. నార్ నారాయణ్ దేవ్, లక్ష్మీ నారాయణ్ దేవ్ శ్రీ స్వామినారాయణ మందిరంలో ఉన్న ప్రముఖ దేవతలు. ప్రపంచవ్యాప్తంగా అనేక స్వామినారాయణ దేవాలయాలు ఉన్నాయి. కాని అహ్మదాబాద్‌లో ఉన్నది ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ శాఖ యొక్క స్థాపకుడు స్వామినారాయణుడు సూచనల మేరకు దీనిని నిర్మించారు.

గుజరాత్‌లోని దేవాలయాలు తొమ్మిది రోజుల నవరాత్రికి ముందే తిరిగి తెరుచుకుంటున్నాయి, కాని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం కఠినమైన కోవిడ్ సంబంధిత నిబంధనలను జారీ చేసింది. గుజరాత్‌లో నవరాత్రి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది వేడుకలను పరిమితం చేశారు. అత్యంత ఆర్భాటంగా నిర్వహించే వేడుకలు రాష్ట్రంలో అంటువ్యాధుల పెరుగుదలకు దారితీస్తుందని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం ప్రసిద్ధ గార్బా నృత్యాలు కూడా అనుమతించబడవు.

రాష్ట్రంలో నవరాత్రితో ముడిపడి ఉన్న ఏ ఆడంబరాలు ఎక్కువగా కనిపించవు. నవరాత్రి సమయంలో దుర్గాదేవిని ప్రార్థించడం కోసం ప్రజలు చిన్న సమావేశాలను నిర్వహించవచ్చు, కాని పరిమిత సంఖ్యలో ప్రజలు ఉంటారు. నవరాత్రి సందర్భంగా 65 ఏళ్లు పైబడిన పౌరులు, 10 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బహిరంగ కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story