కరోనా కేసుల నమోదులో భారత్ రికార్డ్.. ఒకేరోజు 3,14,835 కరోనా కేసులు..

కరోనా కేసుల నమోదులో భారత్ రికార్డ్.. ఒకేరోజు 3,14,835 కరోనా కేసులు..
భారత్‌లో కరోనా విస్పోటనం చెందుతోంది. కోవిడ్ వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ.. కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది.

భారత్‌లో కరోనా విస్పోటనం చెందుతోంది. కోవిడ్ వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ.. కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. కరోనా కేసుల నమోదులో అమెరికాను మించిన భారత్‌లో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఒకేరోజు 3 లక్షలా 14 వేల 835 కరోనా కేసులు నమోదయ్యాయి. జనవరి 8న అమెరికాలో 3 లక్షల 369 కోవిడ్ కేసులు నమోదు కాగా.. ఒకేరోజు 3 లక్షలు దాటి నమోదు కావడం ప్రపంచంలోనే తొలిసారి భారత్‌లో నమోదయ్యాయి.

ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 3 లక్షలా 14 వేల 835 కరోనా కేసులు నమోదు కాగా.. 2 వేల నూటా ఒక్క మంది కరోనా బారిన పడి మృతి చెందారు. అలాగే ఇటీవల ఎన్నడూ లేనంతగా యాక్టివ్ కేసులు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం 22 లక్షల 84 వేల 248 యాక్టివ్ కేసులు ఉండగా.. లక్షా 79 వేల 407 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం కోటి 59 లక్షలా 24 వేల 806 కేసులు నమోదు అయ్యాయి. యాక్టివ్ కేసులు 22 లక్షలా 84 వేల 248కి చేరింది. ఇక కోలుకున్న వారి సంఖ్య కోటి 34 లక్షాలా 49 వేలా 406 ఉండగా.. ఇప్పటివరకు మొత్తం లక్షా 84 వేల 672 మంది మరణించారు.

దేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌లో మరింత విజృంభిస్తోంది. అడ్డూ అదుపు లేకుండా రికార్డస్థాయిలో కొత్త కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. కేవలం 17 రోజుల్లో రోజువారీ కేసులు లక్ష నుంచి మూడు లక్షలకు చేరడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. కోవిడ్ వ్యాప్తి వేగం అమెరికాతో పోల్చితే నాలుగు రెట్లు అధికంగా ఉంది.

గడిచిన 24 గంటల్లో దేశంలోని మొత్తం 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రోజువారీ కేసులు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. పలు రాష్ట్రాల్లో కేసులు సంఖ్య పెరుగుతుండటంతో అమెరికాను అధిగమించి భారత్‌లో ఒకేరోజు 3 లక్షల మార్క్‌ను దాటింది.

Tags

Read MoreRead Less
Next Story